రోజా... ఈమె ఒకప్పుడు సినీ హీరోయిన్ గానే తెలుసు. సినిమాలకు దూరం అయిన తరువాత రాజకీయాల్లోకి వచ్చి తన గ్లామర్ తో అందరిని ఆకట్టుకోవాలని మొదట మెడలో (టీడీపీ) పచ్చకండువా వేసుకున్నారు. ఈమె రాకతో పార్టీకి గ్లామర్ పెరుగుతందని తెలుగు తమ్ముళ్లు భావించి, తెలుగు మహిళా అధ్యక్షురాలిగా కొనసాగారు. ఈమె చేరిన కొన్ని రోజులకే చంద్రబాబు పై హత్యాయత్నం జరిగింది. ఏదో విధి వక్రించి అలా జరిగిందని అనుకున్నారు. ఎంతో కొంత గ్లామర్ ఉంది కదా అని 2004,2009 ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చారు. అఫ్పడు ఆమె ఓడిపోవడమే కాకుండా ఏకంగా టీడీపీ పార్టే అధికారం కోల్పోయింది. దీంతో రోజాకి ఆపార్టీలో గ్లామర్ పోయింది.
దీంతో ఏమి చేయాలో తెలియక రోజా మెల్లిగా అప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రాజశేఖరెడ్డిని కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్దం అయ్యారు. ఇక్కడన్నా ఉన్న గ్లామర్ చూపించి పాపులర్ అవుదామని అనుకుంది. కానీ ఈమె రాజశేఖర్ రెడ్డిని కలిసిన తరువాత ఏకంగా ఆయనే చనిపోయాడు. తరువాత ఆయన కుమారుడు పెట్టిన ‘వైయస్పార్’ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇక్కడైనా రోజా మంచి తెచ్చుకోవాలని ప్రయత్నించింది. కానీ ఈమె పార్టీలో చేరిన కొద్ది రోజులకే ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ జైలు కెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు.
ఇలా మన రోజా ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏదో ఒకటి జరగడంతో ఈమెను ఐరెన్ లెగ్ రోజాగా పార్టీలు చెప్పుకుంటున్నారు. ఇలా ఐరెన్ లెగ్ గా పేరొందిన రోజా ఎన్నికలకు సిద్ధం అంటూ స్టేట్ మెంట్లు ఇస్తుంది. ఆమె విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలో మీడియాతో అన్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినా మా పార్టీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, ప్రజలు కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు.
అయితే ఈమె ఎక్కడ కాలు పెడితే ఆ పార్టీ నాశనం అవుతుంటే ఈమె మాత్రం ఎన్నికలకు సిద్ధం అంటూ ప్రకటనలు చేయడం విచ్రతంగా ఉందని, రెండుసార్లు ఓడిపోయినా ఈమెకు ఇంకా తెలిసిరాలేదని ప్రజలు అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more