కె.ఎ. పాల్ గుర్తున్నాడా? అదేనండీ క్రైస్తవ మత ప్రచారకుడు, రాజకీయ నాయకుడు, గ్లోబల్ పీస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు... గుర్తున్నాడు కదా ? ఇతను అంటే సామాన్యంగా తెలియని వారు ఉండరు. గత కొన్ని రోజుల నుండి తెరమరుగు అయిన కె.ఎ. పాల్ గురించి ఎందుకు చెబుతున్నాడని అనుకుంటున్నారా ? అక్కడికే వస్తున్నా ?
కె.ఎ. పాల్ ఒక మత ప్రచారకుడిగా, రాజకీయ వేత్తగా ఎదిగినా ఒదిగి ఉంటూ ప్రజలకు సేవచేస్తున్నాడనే చెప్పాలి. ఇతను ప్ర.జలకు సేవలు అందించడానికి 144 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ’గ్లోబల్ పీస్‘ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎంత మందికి సేవ చేస్తున్నాడు. సుమారు 3వేల మంది పేద పిల్లలకు ఉచితంగా నాణ్యమైన విద్యను తన ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నాడు. వితంతు మహిళలను చేరదీసి, ఆదరించి వారికి ఎన్నో విధాలుగా సేవ చేస్తున్నాడు. ప్రతి నెలా సుమారు 1 లక్ష మందికి ఫించన్లు అందిస్తున్నాడు.
అతను తన ఇక్కడే కాకుండా 144 దేశాలలో స్థాపించి ఎందరికో సేవ అందిస్తున్నాడు. ఇతని ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సేవ చేయడమే కాకుండా సమాజానికి శాంతి చేకూర్చాలని ప్రయత్నించాడు. ఇంతటితో ఆగకుండా సమాజానికి మరింత సేవ చేయాలనే ఉద్దేశంతో సొంతంగా ఒక రాజకీయ పార్టిని కూడా స్థాపించాడు. సమాజ సేవ చేసే కె.ఎ. పాల్ కి రాజకీయానుభవం లేక పార్టీని బొల్తాకొట్టాడు,
ఇతను హైదరాబాద్ లోని సదాశివ పేటలో 11 ఎకరాలలో గమ్ సిటీని కూడా స్థాపించారు. సాంకేతిక పరిజ్జానం పెంపుకోసం ఈమధ్య కాలంలోనే గమ్ సిటీలో ఓ ఐటీ ప్రోగ్రాంను కూడా నిర్వహించాడు. ఇతనికి సొంతంగా అత్యంత వేగంగా వెళ్ళే బోయింగ్ 147 విమానం సహాయంతో ప్రపంచదేశాలన్నింటిని చుట్టి, తన మత ప్రచారం, శాంతి స్థాపన కార్యక్రమాలు చేసి తద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు.
అయితే ఇంత మంచి పనులు చేస్తున్న కె.ఎ. పాల్ ని దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ నుండి తన మత ప్రచారానికి వచ్చే ఫండ్స్ ని ఆపించి, తన అధికార బలంతో అతని పై బురద జల్లడానికి తనకు వ్యతిరేకంగా తన తమ్ముడినే రంగంలోకి దింపి అసత్య ప్రచారంతో ఒక పిచ్చివాడిగా ప్రచారం చేయించి మానసికంగా దెబ్బతీశారు. ఇతనికి వస్తున్న జనాధరణ చూసి రాజశేఖర్ రెడ్డి ఇతనికి పోటీగా తన అల్లుడు, బ్రాహ్మణుడైన అనిల్ ని తెచ్చి ఇతన్ని దెబ్బ కొట్టడానికి అనిల్ చేత దళితులను ఆకర్షించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేశాడు.
అయితే రాజశేఖర్ రెడ్డి హయాంలో తన అధికార బలంతో కె.ఏ. పాల్ ని అణగదొక్కారని, ఇతని మంచి పనుల గూర్చి తెలుసుకున్న సోనియాగాంథీ కూడా కె.ఏ. పాల్ ని రంగంలోకి దించాలని నిర్ణయించుకొని ఈ మధ్య కాలంలో ‘గమ్ సిటీ‘ నిర్వహించన ఐటీ ప్రోగ్రాంకు కేంద్రం నుండి సోనియాగాంధీ కపిల్ సిబాల్ ని పంపించిందని అనుకుంటున్నారు.
తన తండ్రి మరణం తరువాత అధికారంలోకి రావాలనుకుంటున్న జగన్ తనకు అండగా బ్రదర్ అనిల్ ఉన్నాడని, దళితులను బుట్టలో వేసి అధికారంలోకి రావాలని పన్నాగాలు జగన్ పన్నుతున్నాడని అంటున్నారు.
వైయస్ ఉన్నప్పుడు తన అల్లుడి ద్వారా ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపాడని తెలుసుకున్న సోనియాగాంధీ జగన్ని దెబ్బకొట్టేందుకు అనిల్ కి పోటీగా కాంగ్రెస్ అభ్యర్ధిగా కె.ఎ. పాల్ ని రంగంలోకి దించాలని సోనియా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.
జగన్ కుంభకోణాలు ఒక్కటిగా బయటపడున్నట్లు రానున్న కాలంలో బ్రదర్ అనిల్ బండారం కూడా బయట పడుతుందని అనుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more