టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మెగా ఫ్యామిలీ మధ్య తగదాలు మొదలయ్యాయ? ఎప్పుడు కలిసి ఉంటూ ఒకరి పై ఒకరు ప్రేమాభిమానాలు పంచుకునే చిరంజీవి – పవన్ కళ్యాణ్ కి మధ్య విభేదాలు వచ్చాయా ? అంటే అవుననే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు.
తాజాగా మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ ’పంజా‘ ఆడియో ఫంక్షన్ తరువాత ఈ వివాదానికి మరింత బలం చేకూరుతుంది. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీ సినిమాల ఆడియో, సినిమా విడుదల ఫంక్షన్ అయితే ఆ కుటుంబ సభ్యుల హడావుడి అంతా ఇంతా కాదు. ఇటీవలి వరకు కుటుంబ సభ్యుల హడావుడి కొనసాగింది. అయితే రెండు రోజుల క్రితం‘పంజా‘ ఆడియో విడుదలలో పవన్ సోలోగానే కనిపించారు. ఎప్పుడు అంతా హాజరు అయ్యే వారు ఈ ఆడియోకి వాళ్ళంత రాకుండా ఎక్కడికి వెళ్లారు. ఇదే అభిమానులను వేధిస్తున్న ప్రశ్న. మిగతా కుటుంబ సభ్యులు బిజీగా ఉన్న తన తమ్ముడంటే ఇష్టపడే చిరు, భార్య రేణుదేశాయ్ ఎందుకు రాలేదు ? గతంలో ఆరెంజ్ ఆడియోకి ఇతర దేశాల్లో ఉన్న రామ్ చరణ్ రాకపోయినా, ఇతర రాష్ట్రంలో పవన్ మాత్రం హాజరయ్యాడు.
అయితే ఇప్పుడు ఎవరూ హాజరు కాకపోవడంతో నిజంగానే చిరంజీవి కుటుంబంతో పవన్ కు సంబంధాలు తెగిపోయయా? అనే దాంతో పాటు ఈ ఆడియో ఫంక్షన్ లో పవన్ చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ఈ ఫంక్షన్ లో పవన్ మాట్లాడుతూ, ‘‘ తన సినిమా చూడటానికే వస్తున్నారా? లేక తనను చూడటానికే వస్తున్నారా అనే అనుమానం మొదట్లో ఉండేదని, అంతేగాక వారసత్వాన్ని నమ్ముకోలేదు’’ అని కామెంట్ చేశాడు. ఈ పరిణామాలను దగ్గరి నుండి చూసిన వారు మాత్రం చిరుకి – పవన్కి మనస్పర్థలు వచ్చాయని, దానికి కారణం రాజకీయాలే కారణమని అంటున్నారు.
పి.ఆర్.పి. పార్టీ పెట్టిన తొలినాళ్ళలో పవన్ కళ్యాణ్ తన అన్నకు వెన్నుదన్నుగా ఉంటూ, యువతలో ఉత్సాహం నింపుతూ పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉండేవారు. ఎన్నికల ప్రచారంలో పవన్ ’పంచెలూడ దీసి తరిమి కొట్టండి’ అంటూ కాంగ్రెస్ నేతలపై విరుచుకు పడ్డాడు. ఆ తర్వాత తన అన్నయ్య పెట్టిన పార్టీని కాంగ్రెస్ లోనే విలీనం చేశాడు. ఇలా చేయడం పవన్ కి ఏ మాత్రం ఇష్టం లేదు. విలీనం సమయంలో పవన్ దీన్ని ఖండించాడని కూడా ప్రచారం జరిగింది.
అయితే పీఆర్పీ పార్టీ విలీనం విషయంలోనే అన్నతో కొద్దిగా విభేదాలు వచ్చాయని, అందుకే పీఆర్పీ విలీనం తరువాత పవన్ చిరుని కలువకుండా ఉంటున్నాడని, అన్నయ్య మీద అభిమానం, ఇష్టం ఉన్నా తన రాజీపడని మనస్తత్వంమే దూరం చేసిందని కొందరు అంటున్నారు.
ఈ విషయంలో చిరంజీవి రాజీపడినా, పవన్ కళ్యాణ్ మొదటి నుండి రాజీపడని మనస్తత్వం కాదు – పోరాడే తత్వం కాబట్టి దూరంగా ఉంటున్నాడని, తను ’చెగువీర, వివేకానందుని’ వంటి గొప్పవాళ్ళ సిద్ధంతాలను ఆదర్శంగా తీసుకొనే పవన్ అన్నయ్యకు దూరంగా ఉంటున్నాడని అంటున్నారు.
అన్నయ్య కాంగ్రెస్ లో చేరినా నాగబాబు మాత్రం చిరు వెంటే ఉంటున్నాడు. అన్నయ్య చేరడం ఇష్టంలేని పవన్ మాత్రం ఈ రాజకీయ చిచ్చు వలనే దూరంగా ఉంటున్నాడని, లోపల మాత్రం అన్నయ్య మీద ఇష్టంగానే ఉన్నాడని అంటున్నారు.
ఏది ఏమైనా పవన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సినీ వర్గాల్లో, అభిమానుల్లో గుబులు రేపుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more