కలిసి ఉన్నంత కాలం పనిగట్టుకొని మాపై ఏవేవో ప్రచారాలు చేశారు. ఇప్పుడు విడిపోయాం. అయినా మమ్మల్ని వదలడంలేదు. ఇందులో మీకొచ్చే ఆనందం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. కష్టపడి సెలబ్రిటీ స్థాయికి ఎదగడమే మేం చేసిన తప్పా?’’ అని మీడియాను సూటిగా ప్రశ్నించారు బాలీవుడ్ భామ బిపాసాబసు. కొన్నాళ్ల సహజీవనం అనంతరం జాన్ అబ్రహం, బిప్స్ మనస్పర్థల కారణంగా విడిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జాన్ పేరెత్తితే బిప్స్ తాచుపాములా అంతెత్తు లేస్తున్నారని, బిప్స్ ప్రస్తావన తెస్తే జాన్ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారని ప్రసుతం బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు ప్రసారం అవుతున్నాయి. వీటిపై స్పందిస్తూ బిప్స్ పై విధంగా స్పందించారు. ‘‘అభిప్రాయభేదాల కారణంగా మేం విడిపోయిన మాట నిజం. కానీ ఒకరిపై ఒకరికి ఉన్న గౌరవం మాత్రం ఇసుమంత కూడా తగ్గలేదు. ఇప్పటికీ మేం మంచి స్నేహితులమే. వ్యక్తిగత విషయాల గురించి కూడా మీడియాకు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం నిజంగా దురదృష్టకరం’’ అని ఆవేదన వ్యక్తం చేశారు బిప్స్.
‘‘‘రేస్-2’లో నేను నటిస్తున్నానని తెలియగానే... మళ్లీ మా మధ్య ప్రేమ మొదలైందని రాసేశారు. అందులో నాది జస్ట్ గెస్ట్ రోల్ మాత్రమే. జాన్ కాంబినేషన్‌లో సీన్లు కూడా చాలా తక్కువ. షూటింగ్ స్పాట్‌లో మేము చాలా ఫ్రెండ్లీగా ఉన్నాం. ‘మీరిద్దరూ మళ్లీ కలుస్తున్నారటగా?’ అని జాన్‌ని మీడియా అడిగితే... తను నన్ను తిట్టేశాడని ఓ పత్రికలో వచ్చింది. తను ఎలాంటి వాడో నాకు తెలుసు. ఇన్ని రకాల గాసిప్స్ మాపైనే ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు’’ అన్నారు .
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more