Top producer Dil Raju blessed with a baby boy టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఇంట్లోకి ‘వారసుడోచ్చాడు..’

Jersey producer dil raju welcomes baby boy at 51 with wife tejaswini

Jersey producer, Dil Raju, Tejaswini, Dil Raju son, Dil Raju wife, Dil Raju second wife, Dil Raju daughter, dil raju baby boy, dil raju tejaswini son, dil raju news, dil raju family, dil raju films, Tollywood, Movies, Entertainment

Producer Dil Raju aka Velamakucha Venkata Ramana was blessed with a baby boy. The producer welcomed the newborn with his second wife Tejaswini. Dil Raju who is 51 years old became a proud father for the second time. He also has a daughter, Hanshita Reddy from his first wife. The film producer was earlier married to Anitha, who passed away in 2017 due to cardiac arrest. Raju married Tejaswini in 2020.

టాలీవుడ్ అగ్రనిర్మాత దిల్ రాజు ఇంట్లోకి ‘వారసుడోచ్చాడు..’

Posted: 06/29/2022 07:44 PM IST
Jersey producer dil raju welcomes baby boy at 51 with wife tejaswini

టాలీవుడ్ అగ్రనిర్మాతల‌లో ఒకరైన దిల్‌రాజుకు కథలతో పాటు చిత్ర దర్శకులపై వారి కొత్తదనంపై కూడా చాలా పట్టుంది. వారి టేకింగ్, నరేషన్ సహా అన్నింటినీ విన్న తరువాతే ఆయన అడుగు ముందుకు వేస్తారు. సినిమాల విష‌యంలో ఈయ‌న జ‌డ్జిమెంట్ ప‌క్కాగా ఉంటుంది. అందుకే టాలీవుడ్ స‌క్సెస్ ఫుల్ నిర్మాతగా రాణిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా దిల్‌రాజు మ‌రో సారి తండ్రి అయ్యాడు. ఆయ‌న స‌తీమ‌ణి వైగారెడ్డి ఇవాళ తెల్ల‌వారుజామున మ‌గ‌బిడ్డ‌కి జ‌న్మ‌నిచ్చారు. దాంతో ఈయ‌న ఇంట సంబురాలు మొద‌ల‌య్యాయి.

ఈయ‌న మొద‌టి భార్య అనిత 2017లో కార్డియాక్ అరెస్టు కావడంతో మ‌ర‌ణించారు. వీరికి హ‌న్షిత జ‌న్మించింది. అమెకు పెళ్లైన తరువాత తన తండ్రి ఒంటరిగా ఉండటం ఇష్టంలేక తన తండ్రిని మరో పెళ్లి చేసుకోమ్మని కోరడంతో.. దిల్ రాజు 2020 లాక్‌డౌన్‌లో నిజామాబాద్‌లోని ఓ గుడిలో తేజస్విని రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. తాజాగా ఈ దంప‌తుల‌కు పండంటి మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. ఈ వార్త తెలిసిన ప‌లువురు సినీ ప్రముఖులు సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు తెలుపుతున్నారు.

దీనిపై బండ్ల గ‌ణేష్ స్పందిస్తూ ‘దిల్‌రాజు అన్నా కాంగ్రాచులేషన్స్’ అని తెలుపుతూ.. ఆయ‌న‌కు కొడుకు పుట్టాడని ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించాడు.దిల్‌రాజు ప్ర‌స్తుతం శంక‌ర్-రామ్‌చ‌ర‌ణ్ కాంబోలో తెర‌కెక్కుతున్న పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల చేసే విధంగా దిల్‌రాజు ప్లాన్ చేసుకుంటున్నాడు. దీనితో పాటుగా త‌ల‌ప‌తి విజ‌య్, వంశీ పైడిప‌ల్లి వార‌సుడు చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇటీవ‌లే విడుద‌లైన పోస్ట‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుండి విశేష స్పంద‌న వ‌చ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles