KGF 2: Yash crosses 250 crore in Bollywood in just 5 days బాలీవుడ్ బాక్సీఫీసు బద్దలుకొడుతున్న 'కేజీఎఫ్ 2'

Box office trends kgf 2 crossing rs 250 00 crore in bollywood yash starrer nears rs 600 cr gross at the global box office

KGF-2, KGF chapter 2, Yash, Srinidhi shetty, sanjay dutt, Prashant neel, Sandalwood, box office, Fame, KGF, KGF - Chapter 2, KGF 2, KGF 2 box office, KGF Chapter 2 Box Office, Bollywood, movies, Entertainment

KGF – Chapter 2 has been successful in depositing Rs. 250 crores gross at the Bollywood box office at the end of the fifth day. On the fifth day, it earned Rs. 522 crore gross worldwide.

బాలీవుడ్ బాక్సీఫీసు బద్దలుకొడుతున్న 'కేజీఎఫ్ 2'

Posted: 04/20/2022 07:51 PM IST
Box office trends kgf 2 crossing rs 250 00 crore in bollywood yash starrer nears rs 600 cr gross at the global box office

 యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్ 2' రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్టు పార్టు భారీ విజయాన్ని సాధించడం వలన, సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగినట్టుగానే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా సంచలనానికి తెరతీసింది. తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 164 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అటు బాలీవుడ్ లోనూ ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. తొలిరోజునే ఏకంగా 54 కోట్ల రూపాయలను ఆర్జించి టాప్ లో నిలిచింది.  

బాలీవుడ్ లో ఈ సినిమా ఈ రోజుతో 250 కోట్ల మార్కును టచ్ చేసింది. చాలా వేగంగానే 300 కోట్ల మార్కును అందుకునే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. కథలో బలమైన యాక్షన్ తో పాటు ఎమోషన్ కలవడమే ఇందుకు కారణమని అంటున్నారు. యష్ యాక్షన్ ..  ప్రశాంత్ నీల్ టేకింగ్ ..  ఆసక్తిని రేకెత్తించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ..భారీ తారాగణం ఈ సినిమా ఈ స్థాయిలో విజయాన్ని సాధించడానికి కారణమని అంటున్నారు. తొలిరోజునే ప్రపంచవ్యాప్తంగా 286 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి రికార్డును సాధించింది.

ఇక ఈ వారంతం పూర్తైయ్యే సరికి ఈ చిత్రం ఒక్క బాలీవుడ్ లోనే ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్ లోకి చేరడమే కాకుండా దానిని మించి పరుగులు పెడుతోందని ఖాయమనే సినీవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారీ యాక్షన్ .. దానితో ముడిపెట్టిన మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయని అంటున్నారు. సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించించిన ఈ సినిమాలో, శ్రీనిధి శెట్టి .. రవీనా టాండన్ .. ప్రకాశ్ రాజ్ .. రావు రమేశ్ .. ఈశ్వరీరావు ముఖ్యమైన పాత్రలను పోషించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KGF-2  KGF chapter 2  Yash  Srinidhi shetty  sanjay dutt  Prashanth neel  Sandalwood  Bollywood  

Other Articles