Ashoka Vanam Lo Arjuna Kalyanam from April 30 బరిలో నిలుస్తానంటూ వచ్చేస్తున్న విశ్వక్ సేన్

Vishwak sen ashoka vanam lo arjuna kalyanam to compete with megastar acharya

Rangu rangu ram silaka Lyrical song, Rangu rangu ram silaka, Lyrical song, Ashoka Vanam Lo Arjuna Kalyanam, Ashoka Vanam Lo, Vishwak Sen Ashoka Vanam Lo, Rukshar Dhillon Ashoka Vanam Lo, Vishwak Sen, Rukshar Dhillon, Vidya Sagar Chinta, Jay Krish, Bapineedu, Sudheer Edara, Tollywood, Movies, Entertainment

Young Hero Vishwak Sen starrer Ashoka Vanam Lo Arjuna Kalyanam have announced that the film will be released in theaters on April 30. The film is competing with Tollywood Megastar Chiranjeevi and Mega Powerstar Ramcharan starrer Acharya, directed by renowned director Koratala siva on April 29th.

‘ఆచార్య’తో పోటీకి విశ్వక్ సేన్ 'అశోకవనంలో అర్జున కల్యాణం'

Posted: 04/16/2022 03:03 PM IST
Vishwak sen ashoka vanam lo arjuna kalyanam to compete with megastar acharya

యంగ్ హీరో విష్వక్ సేన్ హీరోగా 'అశోకవనంలో అర్జున కల్యాణం' సినిమా విడుదలకు సిద్దం కానుంది. తొలుత ఈ చిత్ర విడుదలను వాయిదా వేసిన చిత్రబృందం తరువాత దీనిని ఈ నెల 22న విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఇక తాజాగా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన ఫిల్మ్ యూనిట్.. టాలీవుడ్ పరిశ్రమలోనే ఎవరూ చేయని సాహసం చేస్తోంది. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, విష్వక్ సేన్ జోడీగా రుక్షర్ ధిల్లోన్ అలరించనుంది. బాపినీడు -  సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి, జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చాడు.

ఇంతవరకూ మాస్ కి కనెక్ట్ అయ్యే కథలను చేస్తూవు వచ్చిన విష్వక్ సేన్, ఈ సినిమా తో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా ఆకర్షించేందుకు సిద్దమైన విశ్వక్ సేన్.. తన రూట్ మార్చాడు. ఆ ప్రయత్నంలో భాగంగా చేసిన సినిమానే 'అశోకవనంలో అర్జున కల్యాణం'. అయితే ఈ చిత్రాన్ని ఈ నెల 22కు బదులు ఈ నెల 30న విడుదల చేసేందుకు రెడీ అయ్యాడు. నిజానికి ఈ నెల 22వ తేదీ విడుదలకి మంచి సమయమే. అప్పటికి తెలుగు రాష్ట్రాల్లో 'కేజీఎఫ్ 2' ఉద్ధృతి తగ్గుతుంది.

అయితే తమ ప్రకటనకు కట్టబడకుండా మరోమారు విడుదల తేదీని మార్చి ఈ నెల 30న సినిమాను విడుదల చేస్తున్నమని ప్రకటించడం టాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే అందుకు ఒక్క రోజు ముందే మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలసి నటించిన కొణిదెల ప్రోడక్షన్స్ బ్యానర్ పై రాంచరన్ స్వియ నిర్మాణంలో రూపోందించిన 'ఆచార్య' విడుదలవుతుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపోందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అలాంటి సినిమా తరువాత రోజునే బరిలోకి దిగడమంటే అది విష్వక్ సేన్ చేస్తున్న సాహసమే అవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles