KGF 2: Yash crosses 230 crore India wide in just 2 days బాక్సీఫీసును షేక్ చేస్తున్న 'కేజీఎఫ్ 2'..

Box office trends kgf 2 clocks rs 97 50 crore in hindi yash starrer nears rs 300 cr gross at the global box office

KGF-2, KGF chapter 2, Yash, Srinidhi shetty, sanjay dutt, Prashant neel, Sandalwood, box office, Fame, KGF, KGF - Chapter 2, KGF 2, KGF 2 box office, KGF Chapter 2 Box Office, Bollywood, movies, Entertainment

KGF – Chapter 2 has been successful in depositing Rs. 164 crores gross at the worldwide box office at the end of the first day. On the second day, it earned Rs. 122 crore gross worldwide totaling Rs. 286 crore

బాక్సీఫీసును షేక్ చేస్తున్న 'కేజీఎఫ్ 2'.. రెండు రోజుల్లోనే..

Posted: 04/16/2022 04:00 PM IST
Box office trends kgf 2 clocks rs 97 50 crore in hindi yash starrer nears rs 300 cr gross at the global box office

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'కేజీఎఫ్ 2' రూపొందింది. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్టు పార్టు భారీ విజయాన్ని సాధించడం వలన, సెకండ్ పార్ట్ పై అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగినట్టుగానే భారీ ఓపెనింగ్స్ తో ఈ సినిమా సంచలనానికి తెరతీసింది. తొలి రోజునే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 134 కోట్ల గ్రాస్ వసూలు చేస్తోందని అంచనా వేసినా.. ఈ చిత్రం మరింతగా ప్రేక్షకుల ఆధరణ చూరగొని అంచనాలకు మించి ఏకంగా రూ. 26 కోట్ల ఆర్జించింది.

దీంతో తొలిరోజునే ఈ చిత్రం 164 కోట్లను రాబట్టింది. తొలి రోజున హిందీ వెర్షన్ 53.95 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇక రెండో రోజున ఆ లెక్క ఏకంగా రూ. 98 కోట్లకు చేరింది. దీంతో శని, ఆదివారల్లో ఈ చిత్రం బాలీవుడ్ లో ఏకంగా రెండ వందల కోట్ల క్లబ్ లోకి చేరుతుందని అంచనావేస్తున్నారు. ఈ సినిమా ఇంతగా కలెక్షన్లు రావడానికి సెలవులు కూడా ఒక కారణంగా పేర్కోంటున్నారు. ఒక్క కేరళలోనే ఈ సినిమా తొలి రోజున 7.30 కోట్లను కొల్లగొట్టింది. ఇక ఒక్క నైజామ్ లోనే ఈ సినిమా తొలి రోజున 9 కోట్లకి పైగా షేర్ ను సాధించింది. రెండవ రోజున 7.3 కోట్ల షేర్ ను రాబట్టింది.

రెండు రోజుల వసూళ్లను కలుపుకుని చూస్తే, దేశవ్యాప్తంగా ఈ సినిమా 248 కోట్ల గ్రాస్ ను, విదేశాలలో రూ.38 కోట్లను వసూలు చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 286 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి.. ఏకంగా మూడు వందల కోట్ల క్లబ్ లోకి చేరకునేందుకు పరుగులు పెడుతోంది. భారీ యాక్షన్ .. దానితో ముడిపెట్టిన మదర్ సెంటిమెంట్ ఈ సినిమాకి ఈ స్థాయి వసూళ్లను తెచ్చిపెట్టాయని అంటున్నారు. ఈ వారంతంలో ఈ సినిమా 500 కోట్ల మార్కును అందుకోవడం ఖాయమనే సినీవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KGF-2  KGF chapter 2  Yash  Srinidhi shetty  sanjay dutt  Prashanth neel  Sandalwood  Bollywood  

Other Articles