ఐదేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా వంటి హిట్ చిత్రం తర్వాత హీరో నాగార్జున – దర్శకుడు కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘బంగార్రాజు’ విడుదలకు శరవేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపోందుతున్న ఈ చిత్రంలో నాగచైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగార్జునకు జంటగా రమ్యకృష్ణ.. చైకు జోడీగా కృతిశెట్టి సందడి చేయనున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి థియట్రికల్ ట్రైలర్ ని అక్కినేని నాగార్జున విడుదల చేశాడు.
గ్రామీణ నేపథ్యంలో యాక్షన్ కీ .. రొమాన్స్ కి ప్రాధాన్యతనిస్తూ నడిచే కథ ఇది. నాగార్జున సొంత బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదిలారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ .. ఆ పాత్రల కాంబినేషన్లోని ఇంట్రెస్టింగ్ సీన్స్ పై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఒక వైపున స్వర్గంలో అప్సరసల మధ్య నాగ్ అల్లరి .. మరో వైపున గ్రామీణ నేపథ్యంలో చైతూ సందడి .. మరో వైపున కృతి శెట్టి పాత్ర తాలూకు సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
ఇక 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలో శివాలయం .. పాము నేపథ్యంలోని విజువల్స్ కూడా ఈ ట్రైలర్ లో చోటుచేసుకున్నాయి. రావు రమేశ్ .. వెన్నెల కిశోర్ .. ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, యమధర్మరాజు పాత్రలో నాగబాబు కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ఐదేళ్ల క్రితం వచ్చిన సోగ్గాడే చిన్నినాయనా రికార్డులను తండ్రి తనయులు నటించిన బంగార్రాజు చిత్రం తిరగరాస్తుందనే నమ్మకంతో చిత్రబృందం ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more