అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగురాష్ట్రాల యువతతో పాటు యావత్ దేశ యువత దృష్టిని తనవైపుకు తిప్పుకున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండకు దేశవ్యాప్తంగా చాలా ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే గీతగోవిందం చిత్రంతో ఇటు ఫ్యామిలి ఆడియన్స్ కు కూడా చేరువైన ఆయనను ఈ చిత్రం మరో శిఖరానికి చేర్చింది. ఆ తర్వాత అంతటి రేంజ్ వున్న హిట్ విజయ్ ఖాతాలో పడలేదు. అయితేనేం ఆయనకు యువతలో వున్న క్రేజ్ కు మాత్రం ఎలాంటి ఢోకాలేకుండా పోయింది. అయితే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ పూరి కనెక్ట్స్ అనే స్వియ నిర్మాణంతో పాటు కరణ్ జోహార్, నటి చార్మీ, అపూర్వ మెహతాలు ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలు వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడన్న విషయం తెలిసిందే. చిత్రసీమపై కరోనా ప్రభావం భారీగా పడటంతో.. ఆ ప్రభావంతోనే ఈ చిత్ర షూటింగ్ కూడా ఆలస్యమైంది. దీంతో ఎప్పుడో పూర్తికావాల్సిన షూటింగ్ ఈ మధ్యనే ఫునఃప్రారంభమైంది. విజయ్ దేవరకొండ, అనన్య పాండే ప్రధాన పాత్రలలో నటిస్తున్న విషయం తెలిసిందే.
కాగా ఇవాళ లైగర్ ఫస్ట్ గ్లింప్స్ ను చిత్రబృందం రిలీజ్ చేసింది. ముంబైలోని మురికివాడల్లో నివసించే ఒక సాధారణ ఛాయ్ వాలా.. బాక్సర్ గా ఎలా మారాడు.. బాక్సింగ్ టోర్నీలలో ప్రపంచస్థాయికి ఎలా ఎదిగాడన్నది చూపించారు. గ్లింప్స్ ఆద్యంతం బాక్సింగ్ పైనే కట్ చేసింది చిత్రయూనిట్. 'వి ఆర్ ఇండియన్స్' అంటూ లైగర్‌గా విజయ్ దేవరకొండ గర్జించాడు. మొత్తానికి ఈ వీడియోలో లైగర్ లుక్ మాత్రం అదిరిపోయినట్లు కనిపిస్తోంది. స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ సహా రమ్యకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇక ఈ పస్ట్ గ్లింప్స్ లో చిత్రబృందం ఈ చిత్ర విడుదల తేదీని కూడా వెల్లడించింది. ఈ ఏడాది సెప్టెంబరు 9న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. వచ్చే ఏడాది ఉగాదికి ప్రేక్షకులు ముందుకు రావాలనుకున్నప్పటికీ అది కుదరలేదు. దీంతో తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 25న విడుదల కానుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం విజయ్ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్ పూర్తయింది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more