యువహీరో వరుణ్ సందేశ్.. అగ్రరాజ్యంలో తన వ్యాపారాలతో బిజీగా మారడంతో మారాడు. బిగ్‌బాస్ సీజన్ 3లో.. తన భార్య వితికతో కలిసి పాల్గోన్న తరువాత ఆయనకు క్రేజ్ వచ్చినా.. వ్యాపారపరంగా స్థిరపడాలని మళ్లీ అమెరికాకు పయనమయ్యాడు. అయితే సినిమాలలో పెద్దగా ఆపర్లు రాకపోవడం కూడా ఇందుకు కారణమేనని చిత్రపురి టాక్. కాగా, చాలా రోజులకు వరుణ్ సందేశ్ నటించిన సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుంది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో వస్తున్న ఇందువదన సినిమాతో వరుణ్ చాలా ఏళ్ల తరువాత టాలీవుడ్ కు రీఎంట్రీ ఇస్తున్నాడు.
ఈ సినిమాలో ఫర్నాజ్‌శెట్టి కథానాయిక. శ్రీ బాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై ఎం శ్రీనివాస రాజు (ఎంఎస్ఆర్) దర్శకత్వంలో శ్రీమతి మాధవి ఆదుర్తి ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇందువదన సినిమా పోస్టర్స్ చాలా కళాత్మకంగా ఉన్నాయి. యదార్ధ ఘటనలతో ఈ చిత్రాన్ని రూపోందించామని చిత్రబృందం తెలిపింది. అందులో వరుణ్ సందేశ్, ఫర్నాజ్ లుక్‌ను బాగా డిజైన్ చేశారు దర్శకుడు ఎమ్మెస్సార్. ఈ సినిమాకు ఇండస్ట్రీలో ప్రముఖులు ప్రమోషన్ చేస్తున్నారు.
హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాల తర్వాత వరుణ్ సందేశ్ మళ్లీ హిట్ కొట్టలేదు. ఇలాంటి సమయంలో ఇందువదన సినిమా వస్తుంది. ఇందువదన తన సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని నమ్మకంగా ఉన్నాడు ఈ కుర్ర హీరో. ఈ సినిమా కోసం వరుణ్ తనను తాను కొత్తగా ఆవిష్కరించుకున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు సతీశ్ ఆకేటి అందిస్తుండగా.. శివ కాకాని సంగీతం సమకూరుస్తున్నారు. సీనియర్ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. జనవరి 1, 2022 నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరి ఇందువదన మర్చిపోయిన వరుణ్ సందేశ్ ను ప్రేక్షకులకు గుర్తు చేస్తుందో లేదో చూడాలి.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more