Aadi Sai Kumar's Atithi Devo Bhava teaser is out ఆకట్టుకుంటోన్న ఆది ‘అతిధి దేవో భవ’ టీజర్

Aadi sai kumar s atithi devo bhava teaser is out

Atithi Devo Bhava Teaser, Aadi Sai Kumar, Nuveksha, Rohini, Saptagiri, Adarsh Balakrishna, Ravi Prakash, Raghu, Naveena Reddy, Polimera Nageshwar, Shekar Chandra, Srinivasa Cine Creations, Tollywood, Movies, Entertainment

The makers of Atithi Devo Bhava released the latest teaser and is intriguing the movie lovers. Aadi Sai Kumar and Nuveksha are playing the lead roles in the movie. Helmed by Polimera Nageshwar and bankrolled by Rajababu Miryala and Ashok Reddy Miryala under the banner Srinivasa Cine Creations. Shekar Chandra is scoring background music for the film.

ఆకట్టుకుంటోన్న ఆది ‘అతిధి దేవో భవ’ టీజర్

Posted: 12/21/2021 08:09 PM IST
Aadi sai kumar s atithi devo bhava teaser is out

‘రాముడికి లక్ష్మణుడు వెంట ఉన్నట్టు నా భయం ఎప్పుడూ నాతోనే ఉంటుంది’ అని అంటున్నారు నటుడు ఆది సాయికుమార్‌. ఆయన హీరోగా నటిస్తున్న ‘అతిథి దేవోభవ’ చిత్రంలోని సంభాషణ ఇది. తాజాగా టీజర్‌ విడుదలైంది. కొన్ని సరదా సన్నివేశాలు, ట్విస్ట్‌లతో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. టీజర్‌లో వినిపించిన డైలాగ్స్‌ని బట్టి ఈ సినిమాలో కథానాయకుడికి ఏదో లోపం ఉన్నట్టు అర్థమవుతుంది. ‘ఒకడు చెప్పాడని ఇంకొకడితో చేయించేవాడు కాదురా.. ఎవడిది వాడు సెట్‌ చేసుకున్నోడే దమ్మునోడు’ అనే పవర్‌ఫుల్‌ డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉంది.

ఈ చిత్రంలో ఆది సరసన నూతన హీరోయిన్ నువేక్ష సందడి చేయనుంది. పొలిమేర నాగేశ్వర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా సినీ క్రియేషన్స్‌ పతాకంపై మిర్యాల రాజాబాబు, అశోక్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రోహిణి, సప్తగిరి, అదర్శ్ బాలకృష్ణ, రవి ప్రకాశ్, రఘు, నవీనా రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే పోస్టు ప్రోడక్షన్ పనుల్లో తనమునకలైనఈ చిత్రం విడుదలకు సిద్దంగా వుంది. అయితే టీజర్ విడుదల సందర్భంగా చిత్ర బృందం మాత్రం విడుదల తేదీని ఇంకా ఖరారు చేయలేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles