Prabhudevas' Mr Premikudu prefer OTT Release రెండు దశాబ్దాల తరువాత మళ్లీ వస్తున్న ‘మిస్టర్ ప్రేమికుడు’

Prabhudeva starrer mr premikudu to release on ott on oct 20

Prabhu Deva, Nikki Garlani, Prabhu, Adha Sharma, Sakthi Chidambaram, Amrish, Visingiri Srinivas rao, Sri Taraka Rama Pictures, Charlie Chaplin Movie-2, tollywood, Moives, Entertainment

Mr Premikudu Movie OTT Release Date: Prabhudeva Starrer Mr Premikudu is actually a Telugu Dubb of Tamil Movie Charlie Chapling 2 which got released in Tamilnadu theatres in January 2019. V Srinivas rao has Purchased Telugu rights of this Movie. Sakti Chidambaram has helmed this Project.

రెండు దశాబ్దాల తరువాత మళ్లీ వస్తున్న ‘మిస్టర్ ప్రేమికుడు’

Posted: 10/21/2021 06:50 PM IST
Prabhudeva starrer mr premikudu to release on ott on oct 20

ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన ‘చార్లీ చాప్లిన్-2’ త‌మిళ చిత్రం కొలీవుడ్ లో విడుద‌లై విజ‌యం సాధించి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది. ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ టైటిల్ తో తెలుగులో ఈ చిత్రం విడుదల కానుంది. శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్.వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి తెలుగులో డబ్బింగ్ చేసిన చిత్రం కరోనాకు ముందు హక్కులు పోందినా.. మహమ్మారి కారణంగా డబ్బింగ్ కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కార్యక్రమాలన్నీ ముగించుకున్న ఈ చిత్రం విడుదలకు సన్నధమైంది.

ప్రభుదేవా హీరోగా 2002లో వచ్చిన 'చార్లీ చాప్లిన్'కు సీక్వెల్ గా ఈ చిత్రం రూపోందింది. శక్తి చిదంబరం దర్శకత్వంలోనే 'చార్లీ చాప్లిన్ 2' కూడా తెరకెక్కింది. 2019లో తమిళనాడు బాక్సీఫీసు షేక్ చేసిన ఈ చిత్రం తెలుగులో మాత్రం థియేటర్లకు వెళ్లకుండా నేరుగా ఓటిటి యాప్ ద్వారా విడుదల కానుంది. తెలుగులో 'మిస్టర్ ప్రేమికుడు' టైటిల్ తో ఈ సినిమా పలకరించనుంది. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను ఇక్కడ రిలీజ్ చేయనున్నారు.

గతంలో ప్రభుదేవా హీరోగా వచ్చిన 'ప్రేమికుడు' ఘనవిజయాన్ని సాధించింది. అందువలన ఈ సినిమా టైటిల్ కూడా అందుకు దగ్గరగా ఉండేలా చూసుకున్నారు. ఇది కామెడీ ఎంటర్టైనర్ .. గుర్రం మహేశ్ చౌదరి ఈ సినిమాను తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు. ప్రభుదేవా డాన్స్ .. సంగీతం .. సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. మరి ఇక్కడ ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందో వేచిచూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles