Samantha Goes Char Dham Yatra With Shilpa Reddy సమంత చార్ ధామ్ యాత్ర.. బెస్ట్ ఫ్రెండ్ జతగా..

Samantha goes on a spiritual trip with friend shilpa reddy after split with naga chaitanya

Samantha, Shilpa Reddy, Chardham Yatra, Yamunotri, Vashishta Maharshi, Instagram, Naga Chaitanya, tollywood, movies, entertainment

On October 20, Samantha and her friend Shilpa Reddy went to Rishikesh for a dream holiday. Apart from visiting the Ganges, the duo has decided to go on the Char Dham yatra on a helicopter. Shilpa took to Instagram to share pictures with Samantha from their Char Dham yatra.

సమంత చార్ ధామ్ యాత్ర.. బెస్ట్ ఫ్రెండ్ జతగా..

Posted: 10/21/2021 04:51 PM IST
Samantha goes on a spiritual trip with friend shilpa reddy after split with naga chaitanya

తన మానసిక ఉల్లాసం కోసం అగ్రనటి సమంత తీర్థయాత్రలకు వెళ్లింది. తన భర్త హీరో నాగచైతన్యతో విడాకులు పొందిన తరువాత అమె రెండు రోజుల క్రితం కూకట్ పల్లి కోర్టుకు హాజరై తనపై.. తన భర్తతో విడాకుల వ్యవహారంపై అసలు కథనాలకు పూర్తి భిన్నమైన కథనాలు ప్రచురించిన సోషల్ మీడియా ఛానళ్లతో పాటు పలు టీవీ చానళ్లపై చర్యలు తీసుకోవాలని పేర్కోంటూ వాటిపై పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాలతో అమెకు మానసిక ప్రశాంతత దూరమైంది. దీంతో అమె తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్లింది.

తన ప్రాణ స్నేహితురాలితో కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తోంది. స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా జరిగినట్లు ఓ వైపు దైవదర్శనంతో దైవ ఆశీర్వచనాలు అందుకోవడంతో పాటు ఇటు ఎంతో రమణీయమైన ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించేందుకు అమె పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని ప్రముఖ చార్ ధామ్ యాత్రకు వెళ్లింది. తీర్థయాత్రలో భాగంగా తన స్నేహితురాలు శిల్పారెడ్డితో కలిసి  సమంత ‘యమునోత్రి’కి వెళ్లింది. ఈ విషయాన్ని శిల్పారెడ్డి తన ఇన్ స్టాగ్రామ్ లో వెల్లడించింది. హెలికాప్టర్ ముందు సమంతతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేసి.. ‘టేకాఫ్.. మొదట యమునోత్రికి వెళ్తున్నాం’ అంటూ మెసేజ్ చేసింది.

ఇన్ స్టా స్టోరీస్ లో దైవదర్శనం అనంతరం దిగిన ఫొటోను పెట్టింది. ‘చార్ ధామ్ యాత్ర.. ఎప్పటికీ మన స్నేహం చెరిగిపోదు’ అని పేర్కొంది. టూర్ లో భాగంగా గంగానది తీరాన్ని, అక్కడి వశిష్ఠ మహర్షి గుహలను వారు సందర్శించారు. ఆ ఫొటోలను, వీడియోలను శిల్పారెడ్డి ఇన్ స్టా స్టోరీస్ లో పోస్ట్ చేసింది. కాగా, వ్యక్తిగత కారణాలతో ఇటీవల నాగచైతన్యతో సామ్ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆమెపై ఎన్నెన్నో ఆరోపణలు రావడంతో వాటన్నింటికీ కౌంటర్ ఇచ్చి చెక్ పెట్టింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Shilpa Reddy  Chardham Yatra  Yamunotri  Vashishta Maharshi  Instagram  Naga Chaitanya  tollywood  

Other Articles