Sammathame First Glimpse: Breezy And Magical ఆకట్టుకుంటోన్న కిరణ్, చాందినీల ‘సమ్మతమే’ ఫస్ట్ గ్లింప్స్

Sammathame kiran abbavaram and chandini chowdary starrer s first glimpse is a musical journey of love

Sammathame, First Glimpse, Kiran Abbavaram, Chandini Chowdary, SR Kalyana Mandapam, Colour Photo, Gopinath Reddy, Kankanala Praveena, UG Productions, Tollywood, Entertainment, movies

Young and emerging actor Kiran Abbavaram will be seen next in a musical entertainer titled Sammathame. Chandini Chowdary is the leading lady of the film. Today, the first glimpse of the film has been released. It is a musical journey of love, set in the urban backdrop.

ఆకట్టుకుంటోన్న కిరణ్, చాందినీల ‘సమ్మతమే’ ఫస్ట్ గ్లింప్స్

Posted: 10/21/2021 02:50 PM IST
Sammathame kiran abbavaram and chandini chowdary starrer s first glimpse is a musical journey of love

రాజావారు రాణిగారు చిత్రంతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. ఆ తరువాత నటించిన ‘SR కళ్యాణమండపం’ త‌న రెండ‌వ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కోట్టిన విషయం తెలిసిందే. తన మొదటి రెండు చిత్రాలు రొమాంటిక్ యాక్షన్ డ్రామా చిత్రాలుగా నిలుచి కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. కాగా, తన మూడవ చిత్రం పూర్తి రోమాంటిక్ చిత్రంగా రూపొందించే పనిలో నిమగ్నమైన కిరణ్ అబ్బవరం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

“సమ్మతమే” అనే మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కిరణ్ అబ్బవరం. కలర్ ఫోటో చిత్రంతో సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న చాందిని చౌదరి ఈ చిత్రంలో కిరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, కంకణాల ప్రవీణ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి ప‌లు ప్ర‌చార చిత్రాలు విడుద‌ల కాగా, తాజాగా ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

అర్బన్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేయబడిన ఈ మూవీ గ్లిమ్స్ హీరోహీరోయిన్ల విభిన్న పాత్రలను చూపిస్తోంది. ఇందులో కిరణ్ అబ్బవరం మంచి మృదువైన స్వభావం కలిగిన యువకుడిగా కనిపిస్తుంటే.. అతని సహోద్యోగి చాందిని చౌదరి మాత్రం ఈ ట్రెండ్ తగ్గ యువతిగా చిల్ ఔట్ టైప్ లో కనిపిస్తోంది. దర్శకుడు గోపీనాథ్ రెడ్డి విభిన్నమైన ప్రేమ కథతో ముందుకు వచ్చారని ఫస్ట్ గ్లిమ్స్ తోనే అర్థం అవుతోంది కెమెరామెన్ సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ ఆకర్షిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles