Hero Ram Pothineni suffers neck injury హీరో రామ్ మెడకు గాయం.. నెట్టింట్లో ఫోటో వైరల్.!

Tollywood hero ram pothineni suffers neck injury pic goes viral

Young Hero Ram Pothineni, Ram Pothineni neck Injury, Ram Pothineni neck injury gym, Ram Pothineni photo viral, Ram Pothineni injury photo, Ram potineni, Injury, Gym, neck, Telugu Actor, Director Linguswamy, Neck Injury, Tollywood, Movies, Entertainment

Actor Ram Pothineni on Monday suffered a neck injury while working out in a gym. He posted the news on his Instagram handle and shared a photo in which he is seen with a neckband. “Take a break…or take The Break!” he wrote. Instantly, his fans wished him for a speedy recovery as they took to the comments section to send prayers.

హీరో రామ్ మెడకు గాయం.. నెట్టింట్లో ఫోటో వైరల్.!

Posted: 10/04/2021 05:12 PM IST
Tollywood hero ram pothineni suffers neck injury pic goes viral

యంగ్ హీరో రామ్ పోతినేని త‌న సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన ఫోటోతో ఆయన అభిమానులతో పాటు చలనచిత్రరంగంలోని పెద్దలు కూడా షాక్ అవుతున్నారు. యువ హీరోగా పలు చిత్రాల్లో హీరోగా నటించిన రామ్ ఒక్కసారిగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఫొటో హడలెత్తించింది. సరిగ్గా వినాయక చవితి రోజున సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదానికి గురై ఇప్పటికీ అసుపత్రిలో చికిత్స పోందుతున్నాడు. దీంతో ఇంతలోనే మరో యంగ్ హీరో ఇలాంటి ఫోటో పోస్టు చేశారేంటా అన్న అందోళన నెలకోంది.

ఇంతకీ ఆయన పోస్టు చేసిన ఫోటోలో ఏముందంటారా.? ఆయ‌న మెడ‌కు గాయం కావ‌డంతో మెడ‌కు ప‌ట్టీ వేసుకుని ఉండ‌డ‌మే దీనికి కార‌ణం. త‌ల‌ను కూడా ఆయ‌న స‌రిగ్గా క‌దిలించ‌లేక‌పోతున్న‌ట్లు తెలుస్తోంది. జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తుండగా మెడకు గాయమైందని రామ్ పోతినేని చెబుతూ ఈ ఫొటో పోస్ట్ చేశాడు. దీంతో ఆయ‌న త్వ‌రగా కోలుకోవాల‌ని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రామ్‌ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమాలో న‌టిస్తున్నాడు. ఇందులో పాత్ర‌కు త‌గ్గ‌ట్లుగా త‌న శ‌రీర ఆకృతిని మార్చుకోవాల్సి ఉండ‌డంతో రామ్‌ జిమ్‌లో వ్యాయామం చేస్తుండ‌గా గాయ‌మైంది. ప్ర‌స్తుతం రాపో19గా  ఈ సినిమాను ప్ర‌చారం చేస్తున్నారు. రామ్‌కి గాయం కావ‌డంతో షూటింగ్ కు బ్రేక్ ప‌డింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram potineni  Injury  Gym  neck  Telugu Actor  Director Linguswamy  Neck Injury  Tollywood  

Other Articles