No change in release date for Radhe Shyam మార్పుల్లేవ్.. ‘రాధేశ్యామ్’ రిలీజ్ అదే రోజు ఫిక్స్.!

Radhe shyam team reconfirms their release date

Prabhas, Radhe Shyam, Pooja Hegde, Radha Krishna Kumar, UV Creations, Radhe Shyam news, Radhe Shyam updates, Radhe Shyam shoot, Radhe Shyam release date, Radhe Shyam release news, Radhe Shyam new poster, Radhe Shyam new update, Radhe Shyam major update, Radhe Shyam breaking news, Radhe Shyam film news, Tollywood, Movies, Entertainment

Radhe Shyam team reconfirms their Release Date: Young Rebelstar Prabhas is the new pan-Indian actor of the country and he is done with the shoot of his upcoming movie Radhe Shyam. The film is a romantic entertainer which is directed by Radha Krishna Kumar. The movie is made on a massive budget and a major portion of the film is shot in Europe.

మార్పుల్లేవ్.. ప్రభాస్ ‘రాధేశ్యామ్’ రిలీజ్ అదే రోజు ఫిక్స్.!

Posted: 09/29/2021 09:22 PM IST
Radhe shyam team reconfirms their release date

పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ సాహో తరువాత చాలా గ్యాప్ తీసుకుని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తన తాజా చిత్రం 'రాధే శ్యామ్'తో ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇటలీ నేపథ్యంలో 1960ల నాటి ప్రేమకథగా ఈ సినిమా రూపొందుతోంది. యూవీ క్రియేషన్స్, టి సిరీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని జనవరి 14వ తేదీన విడుదల చేయనున్నట్టుగా కొంతకాలం క్రితం ప్రకటించారు.

ప్రభాస్ సరసన నాయికగా పూజ హెగ్డే అలరించనున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ప్రబాస్ చిత్రం అంటే తెలుగుతోపాటు పాన్ ఇండియా చిత్రంగా రూపోందాల్సిన అసవరం ఏర్పడింది. దీంతో ఈ సినిమాను కూడా తెలుగు సహా ఐదు బాషల్లో రూపోందించారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో రూపోందిన ఈ చిత్రాన్ని అనుకున్న తేదీకి అనుకున్న విధంగానే విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక చిత్ర యూనిట్ కూడా సినిమా ప్రమోషన్ వర్కులలో త్వరలోనే నిమగ్నం కానుంది.

కాగా, ఈ సినిమా నుంచి ఫ్యాన్స్ అశించిన అప్ రాకపోవడం.. ఈ చిత్రం విడుదల వాయిదా పడిందా.? అన్న అనుమానాలు అభిమానులతో రేకెత్తాయి. దీనిపై స్పందించిన చిత్ర బృందం తాజాగా స్పష్టతను ఇస్తూ ఓ ట్వీట్ చేసింది. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమాను సంక్రాంతికే విడుదల చేయనున్నామంటూ స్పష్టం చేశారు. దసరా నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు కానున్నట్టుగా తెలుస్తోంది. కృష్ణంరాజు, మురళీశర్మ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. చాలా కాలం తరువాత బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో నటించడం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Prabhas  Radhe Shyam  Pooja Hegde  Radha Krishna Kumar  UV Creations  Tollywood  

Other Articles