Aishwarya Rai Bachchan turns heads at Paris Fashion Week ఎన్నాళ్లకెన్నాళ్లకో.. పారిస్ లో తళుక్కుమన్న ఐశ్వర్యం..!

Aishwarya rai bachchan stuns in white at paris fashion week takes over runway

aishwarya rai, helen mirren, amber heard, l'oreal paris, paris fashion week, paris, Aishwarya Rai Bachchan, Camila Cabello, Aishwarya Rai Paris, Aishwarya Rai Bachchan, Helen Mirren, L'Oreal Paris show, Paris Fashion Week, Bollywood

Aishwarya Rai Bachchan stole the show at the Paris Fashion Week. The 47-year-old actress, who has been a brand ambassador for L'Oreal Paris for years, represented the cosmetics giant at the Paris Fashion Show along with a star-studded list of international celebs.

ఎన్నాళ్లకెన్నాళ్లకో.. పారిస్ ఫ్యాషన్ షోలో తుళుక్కుమన్న ఐశ్వర్యం..!

Posted: 10/04/2021 06:34 PM IST
Aishwarya rai bachchan stuns in white at paris fashion week takes over runway

విశ్వ సుందరిగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను కలిగి వున్న ఐశ్వ‌ర్య‌రాయ్ బచ్చన్ మ‌ళ్లీ ర్యాంఫ్ పై త‌ళుక్కుమ‌న్న‌ది. ఎన్నాకెన్నాళ్లకో మళ్లీ ఆమె ర్యాంప్ వాక్ చూసే అదృష్టం కలిగిందని నెట్ జనులతో పాటు అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అమె.. దేశవ్యాప్తంగా ఎందరికో కలల రాణిగా మారారు. అప్పట్లో యువతకు నిద్రపట్టనీయని అందం. అనుకువ, అంతకుమించిన అభినయం. దీంతో పాటు సంస్కృతి, సంప్రదాయం తెలిసిన నటిగా అమె మహిళా లోకానికే అదర్శంగా నిలిచింది. ఆ తరువాత బచ్చన్ ఇంటి కోడలైన తరువాత కూడా పలు సినిమాల్లో నటించిన తరువాత పూర్తిగా పక్కకు తప్పుకుంది.

ఇక ప్రస్తుతం 47 ఏళ్ల ఈ బాలీవుడ్ బామ.. ప్యారిస్ ఫ్యాష‌న్ వీక్‌లో తళుక్కున మెరిసింది. ర్యాంప్ వాక్‌లో పాల్గొన్న ఐశ్వ‌ర్య‌.. వైట్ డ్రెస్సులో ఆహుతుల్ని అట్రాక్ట్ చేసింది. ఆదివారం జ‌రిగిన ఫ్యాష‌న్ షోలో.. ఐశ్వ‌ర్య‌రాయ్ స్పెష‌ల్‌గా క‌నిపించింది. లారియ‌ల్ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిన ఐశ్వ‌ర్య‌.. పారిస్‌లోని ఈఫిల్ ట‌వ‌ర్ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగిన ఫ్యాష‌న్ షోలో పాల్గొన్న‌ది. స‌మ్మ‌ర్ వుమెన్‌వియ‌ర్‌ను త‌న క్యాట్‌వాక్‌లో ప్ర‌జెంట్ చేసిందామె. బ్రిటీష్ స్టార్ హెలెన్ మిర్రెన్‌తో చేతులు క‌లిపి ఐశ్వ‌ర్య ర్యాంప్ వాక్‌లో జిగేల్‌మంది. ఫ్యాష‌న్ ర‌న్‌వేపై ఐశ్వ‌ర్య‌తో పాటు సినీ న‌టి కెమిల్లా కాబెల్లో, క్యాథ‌రీన్ లాంగ్‌ఫోర్డ్‌, అజా న‌వోమి కింగ్‌, అంబ‌ర్ హెర్డ్‌, నికోల‌జ్ కోస్ట‌ర్ వాల్డూ పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Aishwarya Rai Bachchan  Helen Mirren  L'Oreal Paris show  Paris Fashion Week  Bollywood  

Other Articles