They are the second best in the world: Jagapathi Babu నెట్టింట్లో వైరల్ గా మారిన జ‌గ‌ప‌తి బాబు పోస్టు

They are the second best in the world people should look at them and learn jagapathi babu

Jagapathi Babu, pets, books, twitter, America, pet dog, KGF director, Prashant Neil, Rebel Star Prabhas salaar, Tollywood, movies, Entertainment

Jagapathi Babu, who is currently on a busy schedule, left for America after taking a break. There he is having fun with his family. This was revealed by Jagapathi Babu himself. He shared a photo of himself playing with his pet dog. Pets are said to be unselfish love. He tweeted that books and pets are the best of all .. people should learn a lot from them.

నెట్టింట్లో వైరల్ గా మారిన జ‌గ‌ప‌తి బాబు పోస్టు

Posted: 09/16/2021 08:33 PM IST
They are the second best in the world people should look at them and learn jagapathi babu

తెలుగు ఫ్యామిలీ ఆడియన్స్ కు శోబన్ బాబు తరువాత అంతటి రేంజ్ లో ఆకట్టుకున్న నటుడు జ‌గ‌ప‌తి బాబు అంటే అతిశయోక్తి కాదు. అయితే మారుతున్న కథలు.. ఫ్యామిలీ నేపథ్య చిత్రాలను ప్రేక్షకులు పెద్దగా ఆదరించకపోవడంతో ఆయనకు హీరోగా చిత్రాలు కరువయ్యాయి. ఒక‌ప్పుడు ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు.. తనలోని హీరోను పక్కనబెట్టి.. నటుడ్ని మాత్రమే బయటకు తీయడంతో ఆయన సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. ఇక ఎప్పుడైతే విల‌న్‌గా క‌నిపించాడో అప్ప‌టి నుండి జ‌గ‌ప‌తి బాబు ఫేట్ మారిపోయింది.

బాలకృష్ణ ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన లెజెండ్ సినిమాతో తిరిగి చిత్ర సీమ‌కి రీఎంట్రీ ఇచ్చారు జగపతి బాబు. ఈ సినిమాలో పవర్‏ఫుల్ విలన్ పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు ప‌వ‌ర్‌ఫుల్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించ‌డంతో ఆయ‌నకు ఆఫ‌ర్స్ క్యూ క‌డుతున్నాయి. ప్రస్తుతం జగపతి బాబు.. క్యారెక్టర్ ఆర్టీస్ట్‏గా ఫుల్ బిజీ ఆయ్యాడు. శర్వానంద్ ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న మహాసముద్రం సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నాడు.

సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న రిపబ్లిక్ మూవీలో కీలకపాత్ర పోషించారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ, ప్రభాస్ హీరోగా రూపోందుతున్న స‌లార్‌లోనూ జగపతిబాబు రాజ‌మ‌న్నార్‌గా క‌నిపించ‌నున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌ప‌తి బాబు యూఎస్‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ, పెట్స్, బుక్స్‌తో ఆనంద క్ష‌ణాలు గడుపుతున్న‌ట్టు చెప్పుకొచ్చారు.పెట్స్, బుక్స్ మ‌న ద‌గ్గ‌ర నుండి ఏమి ఆశించకుండా ప్రేమ‌ని చూపిస్తాయి. ఇది ప్ర‌తి ఒక్క‌రు నేర్చుకోవాల‌ని జ‌గ‌ప‌తి బాబు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi Babu  pets  books  twitter  America  pet dog  KGF director  Prashant Neil  Rebel Star Prabhas salaar  Tollywood  

Other Articles

Today on Telugu Wishesh