jayasudha son Nihar Kapoor debuts tollywood as villian విలన్ పాత్రతో నిహార్ కపూర్ తెరంగేట్రం

Jayasudha second son nihar kapoor debuts tollywood as villian in gangster gangaraju

Nihar kapoor, jayasudha, jayasudha second son, jayasudha son Nihar kapoor, jayasudha son debeut as villian, gangster gangaraju, villian role, Lakshy Chadalavada, Vedika Datta, Tollywood, movies, Entertainment

Nihar Kapoor, who is better known as the son of yesteryear actress Jayasudha, has got a violent role in ‘Gangster Gangaraju’. The makers today unveiled his look from the movie. The action film is headlined by Lakshy Chadalavada. If Vedika Datta has a key role, comedian Vennela Kishore, happening character artist Srikanth Iyyangar, ‘Middle Class Melodies’ fame Goparaju Ramana, among others, are part of the cast.

విలన్ పాత్రలో జయసుధ తనయుడు తెరంగేట్రం

Posted: 09/08/2021 05:59 PM IST
Jayasudha second son nihar kapoor debuts tollywood as villian in gangster gangaraju

టాలీవుడ్ లోకి అనేక మంది నటవారసులు వచ్చి తమ టాలెంట్ ను ప్రదర్శించి.. ప్రేక్షకాధరణను పోందుతున్నారు. కొందరు నటనలో రాణిస్తుండగా, కొందరు తెరవెనుక విభాగాల్లో రాణిస్తూ.. తమకు చిత్రసీమతో వున్న అనుబంధాన్ని కోనసాగిస్తున్నారు. ఇదే తరహాలో మొన్నటితర హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులను అలరిచిన నటి జయసుధ.. మారుతున్న కాలంతో పాటు మారుతూ క్యారెక్టర్ అర్టిస్టుగా రాణిస్తున్నారు. అమె కొన్నేళ్ల కిందట తన పెద్ద కొడుకు శ్రేయాస్ చిత్రసీమలోకి తెరంగ్రేటం చేయించారు. 'బస్తీ' అనే సినిమా ద్వారా శ్రేయస్ హీరోగా పరిచయమయ్యాడు.

శ్రేయాస్ మంచి ఒడ్డూ పొడుగూ ఉండటంతో.. అతనికి హీరోయిన్ దొరకడం కష్టమేని భావించిన సినీనిర్మాతలు అతడి వైపు ఒరకంట కూడా చూడలేదు. దీంతో నటుడిగా ఆయన రాణించాలనుకున్న ఆయన తన ప్రయత్నాలకు చెక్ పెట్టాడు. ఇక వ్యాపారరంగంలోకి ఎంట్రీ ఇచ్చి బిజినెస్ వ్యవహరాలను చూసుకుంటున్నారు. ఇక అప్పట్లో ఆయన నటించిన బస్తీ' సినిమా ఎక్కడా నిలబడలేదు. అయితే పెద్ద కోడుకు విషయాన్ని పక్కనబెట్టిన జయసుధ తన రెండో కొడుకును మాత్రం సినీపరిశ్రమలో స్థిరంగా వుంచాలనుకుంది. అమె రెండవ తనయుడు నిహార్ కపూర్ చిత్రసీమలోకి ఎంట్రీ ఇస్తున్నాడు.

అయితే నిహార్ హీరోగా కన్నా విలన్ పాత్రలో రాణిస్తాడని సినీప్రముఖులు చెప్పడంతో హీరో ప్రయత్నాలను చేయకుండా నేరుగా ప్రతినాయకుడి పాత్రలలో ఇమిడేందుకు రెడీ అయ్యాడు. కాగా ఆయన విలన్ గా నటిస్తున్న చిత్రం నుంచి తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు చిత్రబృందం. ఈషాన్ సూర్య దర్శకత్వంలో 'గ్యాంగ్ స్టర్ గంగరాజు' సినిమా రూపొందుతోంది. లక్ష్ - వేదిక జంటగా నటిస్తున్న ఈ సినిమాలో, నిహార్ విలన్ గా పరిచయమవుతున్నాడు. నిన్న ఆయన పుట్టినరోజు కావడంతో ఈ సినిమా నుంచి ఆయన ఫస్టులుక్ ను వదిలారు. మరి విలన్ గా నిహార్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో వేచి చూడాలి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles