Nivetha Thomas shared shocking video in her social media హీరోయిన్ నివేదా థామస్ ఈ పనులు కూడా చేయగలదా.?

Nivetha thomas shared shocking video in her social media

Young heroine, Niveda Thomas, dairy farm, milking the cow, coffee, social media, Netizens, interesting comments, Tollywood, kollywood, movies, Entertainment, video viral, viral video

Young heroine Niveda Thomas The ordinary farmer incarnates and mourns. She went to a dairy farm and enjoyed the fun there. The video went viral after being shared on social media. Niveda who went to the dairy farm .. made good coffee by milking the cow herself. She shared this on her social media account in the form of a video and tagged it as ‘Joy’. Netizens are making interesting comments on this.

ఇప్పటి హీరోయిన్లు సాహసించలేని పనిచేసిన నివేదా..!

Posted: 09/08/2021 12:36 PM IST
Nivetha thomas shared shocking video in her social media

సెలబ్రిటీలు జిమ్ లో ఫిట్ నెస్ వీడియోలు పోస్టు చేస్తేనే.. ఆ వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అలాంటిది మొన్నటి తరం హీరోయిన్లు సావిత్రి, అంజలి, జమున తరం నాటి హీరోయిన్లకు మాత్రమే పరిమితమైన పనులు ఇప్పటి హీరోయిన్లు చేయగలరా అంటే.. కనీసం అలాంటి సాహసాలు కూడా చేయలేరని కామెంట్లు వచ్చేరోజుల్లో.. అలాంటి పనులు చేసి.. వారి బాటలోనే నడచేందుకు తాను సిద్దమంటుందీ బ్యూటీ. సాధారణ రైతు కుటుంబంలో జన్మించి.. బాలనటిగా చిత్రరంగ ప్రవేశం చేసిన ఈమె షేర్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో సంచలనంగా మారింది.

ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అంటారా. నివేదా థామస్. బాలనటిగా తమిళ, మలయాళ చిత్రాలలో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తెలుగులో హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. జంటిల్ మెన్ తో యువ హీరోయిన్ గా కుర్రకారు మనస్సులో చోటు సంపాదించుకన్న ఈ అమ్మడు.. తెలుగు, తమిళంలో మూడు చిత్రాల్లో నటిస్తోంది. నాని ‘నిన్ను కోరి’ ఎన్టీఆర్ ‘జై లవకుశ’ చిత్రంతో పాటు ఇటీవల పవన్ కల్యాన్ నటించిన ‘వకీల్ సాబ్’ చిత్రంలోనూ నటించి అభిమానుల ప్రశంసలను అందుకుంది. ఇలా బిజీగా వుంటూనే.. తీరక సమయంలో తమ డైరీ ఫామ్ కు వెళ్లి.. చేసిన వీడియో నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కోడుతోంది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందనేగా మీ ప్రశ్న. అందులో నివేదా బ్లాక్‌ కలర్‌ జాకెట్‌ ధరించి ఆవు పాలు పితికింది. డైరీ ఫామ్‌కి వెళ్లిన నివేదా.. స్వయంగా తానే ఆవు దగ్గరకు వెళ్లి పాలు పితికి చక్కటి కాఫీ పెట్టుకుంది. దీన్ని ఓ వీడియో రూపంలో తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేస్తూ 'జాయ్' అని ట్యాగ్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కొంతమంది వాటి దగ్గరకు వెళ్లడానికే భయపడతారు.. కానీ నువ్వు వెళ్లడమే కాకుండా పాలు పితికే సాహసం చేశావంటే నువ్వు చాలా గ్రేట్‌ అక్కా’అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' మూవీలో కీలకపాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న నివేదా ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలో రెండు మూడు సినిమాల్లో నటిస్తోంది.

 
 
 
View this post on Instagram

A post shared by Nivetha Thomas (@i_nivethathomas)

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles