Vishwak Sen's Pagal locked release date రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న విశ్వక్ సేన్ ’పాగల్‘

Paagal release date locked for vishwak sen s upcoming film

Vishwak Sen, Simran Choudhary, release date, Radhan, poster,paagal, Nivetha Pethuraj, Naressh Kuppili, megha lekha, Tollywood, Movies, Entertainment

The team of Naresh Kuppili’s Paagal have now announced the Relase date of the movie, Paagal is billed to be a magical love story, presented by Dil Raju and produced by Sri Venkateswara Creations in association with Bekkam Venu Gopal’s Lucky Media. S Manikandan is the cinematographer, while Radhan has scored music. Vishwak Sen is playing the lead role.

రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న విశ్వక్ సేన్ ’పాగల్‘

Posted: 08/07/2021 06:49 PM IST
Paagal release date locked for vishwak sen s upcoming film

యువహీరో విష్వక్ సేన్ కథనాయకుడిగా బెక్కెం వేణుగోపాల్ 'పాగల్' సినిమాను రూపోందించారు. నరేశ్ కుప్పిలి నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావలసింది. కానీ కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. ధియేటర్లు తెరుచుకోవడంతో చిత్రాలన్నీ విడుదలకు క్యూ కడుతున్నాయి. దీంతో ఇప్పటికే చిత్రం షూటింగ్ తో పాటు పోస్టు ప్రోడక్షన్ పనులను కూడా జరుపుకున్న ఈ చిత్రం ఇక త్వరలో విడుదలకు సిద్దం అయ్యింది. తాజాగా రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది.

సినిమా ఎప్పుడు విడుదల అవుతుందన్న విషయాన్ని సింబాలిక్ గా కొత్త పోస్టురుతో చె్పే చిత్రయూనిట్ల సంప్రదాయాలను అనుసరిస్తూ ఫాగల్ చిత్ర బృందం కూడా రిలీజ్ డేట్ తో కూడిన పోస్టర్ ను వదిలారు. ఇటు యూత్ ను .. అటు మాస్ ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాలో విష్వక్ సేన్ జోడీగా నివేదా పేతురాజ్ .. సిమ్రన్ చౌదరి కనువిందు చేయనున్నారు. రధన్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

మురళీశర్మ.. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. చంద్రబోస్, కృష్ణ కాంత్ కలం నుంచి జాలువారిన పాటలు కూడా చిత్రానికి ప్లస్ అంటుంది చిత్రబృందం. 'హిట్' సినిమా తరువాత విష్వక్ సేన్ చేసిన మూవీ ఇది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ఆదరణను చూరగోంటుందని బలమైన నమ్మకంతో ఆయన ఉన్నాడు. మరి ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh