Vijay Anthony To Direct Bichagadu 2! బిచ్చగాడు-2 తో మెగాఫోన్ కూడా పట్టి వస్తున్న విజయ్ అంటోని..

Vijay antony to headline and direct bichagadu 2

Bichagadu 2, Vijay Antony, priya krishnaswamy Director, Producer, Vijay Antony Film corporation, murugadoss, kollywood, bichagadu sequel, Tollywood, movies, Entertainment

Vijay Anthony is a multi-talented artist who is a well-known singer, music director, and actor. Now, he is all set to showcase his directorial skills as well. Vijay is donning the director’s hat for the sequel of his super hit film Bichagadu.

బిచ్చగాడు-2 తో మెగాఫోన్ కూడా పట్టి వస్తున్న విజయ్ అంటోని..

Posted: 07/24/2021 04:03 PM IST
Vijay antony to headline and direct bichagadu 2

‘బిచ్చగాడు’ చిత్రం ఎంతటి సూపర్ హిట్ సినిమాగా నిలిచిందో అందరికీ తెలిసిందే. అమ్మ పదానికి వున్న విలువ, గౌరవం, ప్రేమ, అప్యాయతలకు ఈ చిత్రం సాధించిన విజయం ఓ కొలమానం అని చెప్పవచ్చు. ఈ చిత్రంలోని అమ్మ సెంటిమెంటుకు దాదాపుగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ ప్రేక్షకులను ఎంతగా కట్టిపడేసిందో ఈ చిత్ర రికార్డులే సాక్షంగా నిలుస్తాయి. సెంటిమెంట్ల, ఎమోషన్ డ్రామాగా వచ్చిన ‘బిచ్చగాడు’ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథ పట్టడంతో బాక్సాఫీసు వద్ద అది ఎంతపెద్ద హిట్ అయ్యిందో.. కాసుల వర్షమే సాక్ష్యం.

అలాంటి బిచ్చగాడు చిత్రంతో దక్షిణాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ అంటోని నటకు ప్రేక్షకులు మంత్రముగ్దులయ్యారు. అయితే ఈ చిత్రం తరువాత పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా అవి హిట్ టాక్ సోంతం చేసుకోలేదు. దీంతో మరోమారు విజయ్ అంటోని బిచ్చగాడు సీక్వెల్ తోనే వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇక ఈ చిత్రానికి ఆయనే దర్శకత్వం కూడా వహిస్తున్నాడు. ఓ వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా మారిన విజయ్ బిచ్చగాడు-2తో దర్శకుడిగా కూడా మారి మెగాఫోన్ ను చేత పట్టనున్నాడు.

ఈ నేపథ్యంలో ఇవాళ బిచ్చగాడు-2 సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఈ రోజు ఆయన విడుదల చేశాడు. తన మనసుకు నచ్చిన ప్రాజెక్టుకు దర్శకత్వం వహించడం ఆనందంగా ఉందని ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా ఈయనకు మరో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అభినందనలు తెలిపాడు. ‘‘దర్శకుల కుటుంబానికి స్వాగతం డైరెక్టర్ విజయ్. ‘బిచ్చగాడు 2’ 2022లో భారీ బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఆల్ ది బెస్ట్’’ అని ట్వీట్ చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles