యంగ్ హీరో తేజ సజ్జ - కన్నుగీటు సుందరి ప్రియా ప్రకాశ్ వారియర్ జంటగా 'ఇష్క్ .. నాట్ ఏ లవ్ స్టోరీ' సినిమా విడుదలకు రెడీ అయ్యింది. ఈ నెల 30వ తేదీన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది. కరోనా రెండవ దశ తరువాత విడుదల కానున్న ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఎలా వస్తాయన్నది వేచి చూడాల్సిందే. అయితే ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎన్వీ ప్రసాద్ .. పారస్ జైన్ .. వాకాడ అంజన్ కుమార్ బాబు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక హీరోహీరోయిన్లపై సాగిన చక్కని వీడియో సాంగ్ ను వదిలారు. 'ఆనందం మదికే ..' అంటూ ఈ పాట సాగుతోంది. మహతి స్వరసాగర్ స్వరపరిచిన ఈ పాటకి శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, సిద్ శ్రీరామ్ ఆలపించాడు. బ్యూటిఫుల్ విజువల్స్ పై కట్ చేసిన ఈ పాట చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో వచ్చిన మంచి మెలోడీగా దీనిని చెప్పుకోవచ్చు.
ప్రియా ప్రకాశ్ వారియర్ కొంచెం ఒళ్లు చేసినట్టుగా ఉంది.. అమె ఎక్స్ ప్రెషన్లలో మాత్రం ఏ తేడా కనిపించలేదు. ఇక ప్రియాప్రకాష్ వారియర్ ఈ సినిమాలో మరింత గ్లామరస్ గా కనిపిస్తోంది. ఈ సినిమా ఆమె కెరియర్ కి హెల్ప్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. థియేటర్లు ఓపెన్ అవుతున్న రోజునే ఈ సినిమా వస్తుండటం విశేషం. 'జాంబి రెడ్డి'తో హిట్ అందుకున్న తేజ సజ్జ, ఈ సినిమాతోను సక్సెస్ ను సాధిస్తాడని ఆశిద్దాం.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more