వెంకటేశ్ కథానాయకుడిగా రూపొందిన 'నారప్ప' చిత్రం ఇటీవలే ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథాకథనాల పరంగా విమర్శకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. తెలుగు ప్రేక్షకులకు పంచపాండవులు చిత్రంలో పరిచయమై విక్టరీ వెంకటేష్ గా ముద్రపడినా.. బ్రహ్మపుత్రుడు, ధర్మచక్రం లాంటి చిత్రాలతో తనలోని నటనకు అధికపాధ్రాన్యమిచ్చి.. తనను కాకుండా తన నటనను చూడాలనేలా గోపాల గోపాలా, దృశ్యం చిత్రాలతో తనలోని నటవిశ్వరూపాన్ని ప్రదర్శించిన వెంకటేశ్.. తాజాగా నారప్పతో హ్యాట్సాఫ్ ఫర్పామెన్స్ ను అందుకున్నాడు.
ఈ చిత్రంలో ఒక వైపున తనకి ఉన్న కొద్దిపాటి భూమిని కాపాడుకోవాలి .. మరో వైపున తన భార్యాబిడ్డలను రక్షించుకోవాలి అని ఆరాటపడే 'నారప్ప' పాత్రలో వెంకటేశ్ అద్భుతంగా నటించాడనే ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిరంజీవి కూడా తన స్పందనను తెలియజేశారు. 'నారప్ప' సినిమాను చూశాను .. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి సినిమా ఇది. తెరపై నాకు 'నారప్ప' తప్ప ఎక్కడా వెంకటేశ్ కనిపించలేదు. ఆయన ఆ పాత్రను లోతుగా అర్థం చేసుకున్న తీరు .. సన్నివేశాలను పండించిన విధానం గొప్పగా ఉన్నాయని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు.
వెంకటేశ్ కెరియర్లో గర్వంగా చెప్పుకునే సినిమాగా నిలవడంతో పాటు తెలుగు చిత్రపరిశ్రమలో ఆణిముత్యంలా ఈ చిత్రం మారుతుందని చిరంజీవి అన్నారు. చిరంజీవి అభినందనల పట్ల వెంకటేశ్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "మీ ప్రతి మాట నాకు ఎంతో ఆనందాన్నీ .. సంతృప్తిని కలిగించాయి. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది" అన్నారు. ఇక ఇదే విధంగా ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, ఈ సినిమాలో వెంకటేశ్ నటనను ప్రస్తావిస్తూ ప్రశంసలను అందజేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more