Actor Chandra Mohan gives clarification on Fake news తన అరోగ్యంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన సీనియర్ నటుడు

Senior actor chandra mohan gives clarification on fake news

chandra mohan Health condition, senior actor chandra mohan, fake news on chandra mohan, charecter artist chandra mohan, yester years hero chandra mohan, chandra mohan social media, chandramohan, Senior Actor, fake news, social media, Health issue, yester years hero chandramohan, Charecter artist, Tollywood

Tollywood Seniot Actor ChandraMohan gives clarification on his health, says he is good, fine and Healthy. The Yester Years Hero rubbishes the fake news which is doing rounds in social media.

తన అరోగ్యంపై ఫేక్ న్యూస్ ను ఖండించిన సీనియర్ నటుడు

Posted: 05/25/2021 07:01 PM IST
Senior actor chandra mohan gives clarification on fake news

సోషల్ మీడియాలో ఎవరో పనిగట్టుకుని చేస్తున్న ఫేక్ న్యూస్ తో తన అభిమానులు ఎవరూ అందోళన చెందాల్సిన పనిలేదని సీనియర్ నటులు చంద్ర మోహన్ అన్నారు. తన ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని వాటిని చదివి తన అభిమానులు అందోళనకు గురికాకూడదని అన్నారు. ఇటువంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసే వాళ్లకి కఠినంగా శిక్ష పడాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారాయన.

ఇటీవలే మే 23న తన పుట్టిన రోజును పురస్కరించుకుని కుటుంబసభ్యులతో సరదాగా గడిపిన చంద్ర మోహన్.. తన జన్మదినం సందర్భంగా తనకు శుభాకాంక్షలు తెలిపిన పలువురు సినీ వర్గాల వారకి, సినీ ప్రముఖులకు, అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు, ఇటీవల ఇక నటనకు శెలవు అని చెప్పిన చంద్ర మోహన్ మాటలను తీసుకుని.. ఆయన ఆరోగ్యం బాగోలేదని, ఆయన ఇక లేరు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. అయితే తాను చాలా ఫిట్ గా, అరోగ్యంగా వున్నానని ఆయన తెలిపారు.

తన గురించి తనకన్నా ఎవరికీ ఎక్కువ తెలియదని, తాను అరోగ్యంగా వున్ననని పది మందికీ చెప్పాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయని ఆయన అన్నారు. పుకార్లు పుట్టించడంలో ఘనాపాటీలకు సోషల్ మీడియా ఆయుధంగా మారిందని, ఇలా తప్పుడు వార్తలను ప్రచారం చేసేవారిపై ప్రభుత్వాలు, పోలీసులు నిఘా పెట్టాలని ఆయన కోరారు. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసేవారి కోసం అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకురావాలని ఆయన కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

Today on Telugu Wishesh