Hari Hara Veera Mallu: Makers spending a bomb on VFX అద్భుత గ్రాఫిక్స్ తో రూపోందుతున్న 'హరి హర వీరమల్లు'

Pawan kalyan s hari hara veera mallu makers spending a bomb on vfx

Hari Hara Veera Mallu , pawan kalyan, Krish Jagarlamudi, Hari Hara Veera Mallu pawan kalyan, Hari Hara Veera Mallu Krish Jagarlamudi, Hari Hara Veera Mallu spectacular Visual wonder, VFX works, rich graphics, Nidhhi Agerwal, Jacqueline Fernandez, Krish Jagarlamudi, Tollywood

Powerstar Pawan Kalyan and Crafty director Krish Jagarlamudi are currently working on Hari Hara Veera Mallu. By now, everyone is aware that the period drama is set in the 17th-century backdrop of the Mughals and Qutub Shahis era. The latest update is that the film is said to be made mostly in artificial sets and VFX effects to be the highlight of the film. It is heard that nearly Rs 50 crore are being spent on the graphic work alone.

విజువల్ వండర్ గా రూపోందుతున్న 'హరి హర వీరమల్లు'

Posted: 05/21/2021 07:53 PM IST
Pawan kalyan s hari hara veera mallu makers spending a bomb on vfx

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తొలిసారిగా చారిత్రక నేపథ్యమున్న చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చారిత్రక నేపథ్య చిత్రాలైన గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక చిత్రాలను తెరకెక్కించి.. తన సత్తాను ఇటు టాలీవుడ్ తో పాటు అటు బాలీవుడ్ లోనూ చాటిన ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి. ఇక క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపోందుతున్న చిత్రమే 'హరిహర వీరమల్లు'. మొగలాయీలు, కుతబ్ షాహీల కాలం నాటి నేపథ్యంతో 17వ శతాబ్దానికి చెందిన చిత్రాన్ని క్రిష్ రూపోందిస్తున్న విషయం తెలిసిందే.

ఈ చిత్రం కోసం నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంగా, జాక్విలిన్ మొగల్ రాణి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకి ఎ.ఎం. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. పవన్ కల్యాణ్ నటిస్తున్న తొలి చారిత్రక నేపథ్యమున్న చిత్రం కావడంతో ఆయన అభిమానుల అంచనాలను తగ్గట్టుగా చిత్రాన్ని రూపోందించే పనిలో వున్నారు దర్శకులు క్రిష్. ఈ చిత్రాన్ని విజువల్ వండర్ గా తీర్చిదిద్దేందుకు ఎంతటి ఖర్చు అయినా వెనక్కు తగ్గడం లేదట క్రిష్. ఈ చిత్రం కోసం చార్మినార్, ఎర్రకోట, మచలీపట్నం పోర్టు సహా పలు సెట్లను తీర్చిదిద్దిన చిత్ర యూనిట్.. సెట్ల కోసం ఇటు గ్రాపిక్స్ కోసం భారీగానే ఖర్చుచేస్తున్నారని టాక్.

కోట్ల రూపాయల ఖర్చుతో మొగల్ కట్టడాల సెట్లు వేస్తున్నారు. ఈ సినిమాలో సగం ఖర్చు సెట్ల కోసమే చేస్తున్నారట. కథా పరంగా గ్రాఫిక్స్ కి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారట. కేవలం గ్రాఫిక్స్ కోసమే 50 కోట్ల రూపాయలను కేటాయించారట. హాలీవుడ్ టెక్నీషియన్స్ ను నియమించడమే ఇంతటి ఖర్చుకు కారణమని చెబుతున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమాను దిద్దుతున్నారట. పవన్ కల్యాణ్ కెరియర్లో ఇది మొదటి చారిత్రక చిత్రం కావడంతో, అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమా, కరోనా ప్రభావం తరువాత మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles