మత్తు వదలరా బాబు.. మత్తు వదలరా అంటూ పెద్దలు చెప్పడం.. ఇంట్లో ఇల్లాలు, పిల్లలు కంటతడి పెట్టడం కూడా జరుగుతుంది, మద్య నిషేధం కోసం ఉద్యమించి.. ప్రజల మనిషి.. ఆంధ్రుల ఆరాధ్యుడు ఎన్టీఆర్ చేత మద్య నిషేద ప్రకటన చేసి సాధించిన మహిళా శక్తి మనది. ఇప్పటికీ తమ గ్రామాల్లో మద్యం దుకాణాలను పెట్టరాదని మహిళలు అక్కడక్కడా మద్యం దుకాణాలపై దాడి చేస్తూనే వున్నారు. కానీ ఇన్నాళ్లు ఏదైతే మహిళా శక్తి అని భావిస్తున్నామో.. అదే శక్తిని అడ్డుపెట్టుకుని మద్యం వ్యాపారులు తమ బ్రాండ్లను ప్రమోట్ చేయిస్తున్నారు. అయితే పెద్దగా పేరు లేని బామలు ఎందరు ప్రచారం చేసినా పట్టించుకోని మహిళా శక్తికి పెద్ద షాక్ తగిలింది.
ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులు మరీ ముఖ్యంగా యువతలో తనకంటూ పధిలమైన స్థానాన్ని ఏర్పర్చుకున్న హీరోయిన్ పాయల్ రాజపుత్.. తాజాగా మద్యం గ్లాసు చేతబట్టుకుని.. దానిని ఓరవంక చూస్తూ.. నవ్వుతూ ఓ ఫోటోకు ఫోజు ఇచ్చింది. సరేలే ఎదో గుట్టుగా మద్యం ప్రచారం చేస్తుందనుకుంటూ ఏకంగా ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేసి సంచలనానికి తెరతీసింది. స్కాచ్ విస్కీ, ఇండియన్ మాల్ట్స్ ల సమ్మేళనంతో కూడిన రాయల్ ఛాలెంజ్ విస్కీ ఇక తెలంగాణలో కూడా అంటూ పెద్ద క్యాప్షన్ కూడా ఇచ్చింది.
ఈ పిక్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేయగా, నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ పిక్ తో అమె ప్రశంసలతో పాటు విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది, విమర్శలకు దిగివచ్చిన పాయల్.. తాను మద్యం సేవించడం లేదని.. కేవలం ఓ వ్యాపార ప్రకటన ప్రచార నిమిత్తం జరిగిన షూట్ లోని ఫోటోను పోస్టు చేశానని చెప్పింది. అయినా, ఆమె చేతిలో మందు గ్లాస్ ఉండటం పట్ల పలువురు అభిమానులు హర్ట్ అవుతున్నారు, ఓ హీరోయిన్ గా మద్యాన్ని ప్రమోట్ చేయడం ఏంటని ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. ఓ బాధ్యతగల అమ్మాయిగా, నలుగురికీ ఆదర్శంగా నిలవాల్సింది పోయి, ఇలా మద్యం ప్రకటనల్లో నటించడం ఏంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి,
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more