Ranguladdhukunna lyrical video from Uppena వైష్ణవ్ తేజ్ 'ఉప్పెన' నుంచి రంగులద్దుకున్నా లిరికల్ వీడియో.!

Ranguladdhukunna lyrical video from uppena featuring vaisshnav tej krithi

Uppena, lyrical video, Ranguladdhukunna, Panja Vaisshnav Tej, Krithi Shetty, Yazin Nizar, Haripriya, Sreemani, Vijay Sethupathi, Gayatri Jayaraman, Rajasekhar Aningi, Master Raghavan, Rajeev Kanakala, Buchi Babu Sana, Devi Sri Prasad. Naveen Yerneni, Y Ravi Shankar, Mythri Movie Makers, Sukumar Writings, Tollywood, movies, Entertainment

The lyrical video 'Ranguladdhukunna' from Uppena starring Panja Vaisshnav Tej and Krithi Shetty in lead roles is out. The song was sung by Yazin Nizar and Haripriya and lyrics penned by Sreemani. The film also stars Vijay Sethupathi, Gayatri Jayaraman, Rajasekhar Aningi, Master Raghavan, and Rajeev Kanakala in supporting roles.

వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ నుంచి రంగులద్దుకున్నా లిరికల్ వీడియో.!

Posted: 11/12/2020 01:17 PM IST
Ranguladdhukunna lyrical video from uppena featuring vaisshnav tej krithi

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, డైనమిక్ హీరో సాయిధరమ్ తేజ్‌ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న సినిమా 'ఉప్పెన'. అందాలబామ, కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి క్రియేటివ్ దర్శకుడు సుకుమార్‌ శిష్యుడైన బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపోందుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలోనుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా, తాజాగా మూడో పాటను సూపర్‌ స్టార్‌ మహేశ్ బాబు విడుదల చేశాడు.

‘ఉప్పెన సినిమా నుంచి అందమైన మెలోడి ‘రంగులద్దుకున్న’ను విడుదల చేస్తున్నాను. నా ఫేవరేట్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, సుకుమార్, వెండితెరకు పరిచయమవుతోన్న పంజా వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి, బుచ్చిబాబు సానాకు, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌బాబు ట్వీట్‌ చేశారు. లాక్ డౌన్ తరువాత తన తొలి పాటను డీఎస్పీ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంకితం చేశారు. ఇక ముచ్చటగా విడుదలైన మూడవ పాట చెవులకు శ్రావ్యానందన్ని కలిగించే చక్కని మెలోడీ సాంగ్. ఈ పాటతో దేవిశ్రీ ప్రసాద్ సంగీత ప్రియులను మెస్మరైజ్ చేశారంటే అతిశయోక్తి కాదు.

‘రంగుల‌ద్దుకున్నా తెల్ల‌రంగుల‌వుదాం. పూలు క‌ప్పుకున్నా కొమ్మ‌ల‌ల్లె ఉందాం..’ అంటూ ప్రకృతి అందాల మధ్య సాగుతున్న ఈ పాట సినిమాపై అంచనాలు మరింత పెంచేలా ఉంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీమణి లిరిక్స్‌ అందిచగా, యాజిన్ నిజ‌ర్, హ‌రిప్రియ ఆలపించారు. కాగా, ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుద‌లైన ‘నీ క‌న్ను నీలి స‌ముద్రం’, ‘ధ‌క్ ధ‌క్ ధ‌క్’ పాటలకు విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘నీ కళ్లు నీలి సముద్రం’ పాట మ్యూజిక్‌ లవర్స్‌ను ఎంతగానే ఆకట్టుకుంది. యూట్యూబ్‌లో ఈ పాట ఏకంగా140 మిలియ‌న్ వ్యూస్ దాటింది. ఇప్పుడు ఈ మూడో పాట ఎన్ని వ్యూస్ తెచ్చిపెడుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles