RRR team participates in Green India Challenge గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గోన్న ఆర్ఆర్ఆర్ టీమ్

Rrr movie team participates in green india challenge

RRR, Ram Charan, Green India Challenge, Acharya, Radhe Shyam, Pushpa, Junior NTR, SS Rajamouli, Alia bhatt, Ajay Devgn, MM Keeravani, RRR Update, RRR latest Update, Entertainment, movies, Tollywood

Accepting actor Ram Charan's challenge, the RRR movie team comprising director S S Rajamouli and cameraman K K Senthil Kumar on Wednesday planted saplings on the shooting spot. The team nominated Acharya, Radhe Shyam, and Pushpa film teams for the challenge.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గోన్న ఆర్ఆర్ఆర్ టీమ్

Posted: 11/11/2020 03:35 PM IST
Rrr movie team participates in green india challenge

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో చారిత్రక నేపథ్య చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌ రూపోందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ సెన్సేషనల్ డైరక్టర్ జక్కన్న బాహుబలి తరువాత రూపోందిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా వున్నాయి. అన్ లాక్ తో సడలించిన మార్గదర్శకాలు విడుదల కావడంతో మొత్తంగా చిత్ర యూనిట్ చిత్రీకరణలో బిజీగా వుంది, అయితే లాక్ డౌన్ సమయం నాటి నుంచి గ్రీన్ ఇండియా చాలెంజ్ కూడా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనికి తోడు సినీప్రముఖులు కూడా ఈ ఛాలెంజ్ లో పాల్గొనడం తమ తోటివారిని ఛాలెంజ్ చేస్తుండటం కనిపిస్తోంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఈ ఛాలెంజ్ ను ఎదుర్కోన్న మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ్.. ఆ తర్వాత ఆలియా భ‌ట్, దర్శకుడు రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా బృందం సభ్యులు అందరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆయన చాలెంజ్ చేశాడు. దీంతో ఈ రోజు ఆర్ఆర్ఆర్ బృందం ఇందులో పాల్గొని మొక్కలు నాటింది. అనంతరం చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్, అల్లు అర్జున పుష్ప సినిమాల యూనిట్లకు ఆర్ఆర్ఆర్ బృందం చాలెంజ్ విసిరింది. మొక్కలు నాటుతూ తీసుకున్న వీడియోను ఈ సందర్భంగా పోస్ట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RRR  Ram Charan  Junior NTR  SS Rajamouli  Green India Challenge  Acharya  Radhe Shyam  Pushpa  MM Keeravani  Tollywood  

Other Articles