Ranguladdhukunna lyrical video from Uppena గౌతమ్ ను హగ్ చేసుకున్న మహేశ్.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Ranguladdhukunna lyrical video from uppena featuring vaisshnav tej krithi

Mahesh Babu, Mahesh Babu son, Gautam Ghattamaneni, Mahesh Babu Gautam, Namrata Shirodkar, Mahesh Babu Namrata, Mahesh Babu family holiday, Mahesh babu interesting comments, dubai, Hugging son, interesting comments, Tollywood, movies, Entertainment

Mahesh Babu and his family are off to Dubai to spend their holidays. The superstar took to social media to share an adorable photo of himself hugging his son Gautam. Sharing the photo, Mahesh Babu wrote, "It's a lot more difficult to hug him now. Never needed a reason or a perfect time (sic)," with heart and hug emojis.

గౌతమ్ ను హగ్ చేసుకున్న మహేశ్.. ఆసక్తికర వ్యాఖ్యలు..

Posted: 11/11/2020 04:29 PM IST
Ranguladdhukunna lyrical video from uppena featuring vaisshnav tej krithi

కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్.. ఆ తరువాత అన్ లాక్ మార్గదర్శకాల కారణంగా ఇన్నాళ్లు ఇంటికే పరిమితమై కుటుంబంతో సరదాగా గడిపిన బిజీ జిటీ సెలబ్రీటీలలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒకరు, ఆయనే కాదు ఆయన సతీమణి నమ్రతా కూడా ఆయన చేయతలపెట్టిన పనులను పర్యవేక్షిస్తూ.. అందుకు సమయాన్ని కేటాయిస్తూ బిజీగా మారింది. అయితే కరోనా నేపథ్యంలో గత కొన్ని నెలలుగా హాయిగా ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్న ఆయన తన కుటుంబసభ్యులతో కలసి సరదాగా గడిపారు, ఇక కాసింత వెసలుబాటు లభ్యం కావడంతో ప్రిన్స్ మహేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు బయల్దేరిన విషయం తెలిసిందే.

ఇదిలావుండగా ఆయన తాజాగా పోస్ట్ చేసిన ఓ ఫొటో నెట్టింట్లో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంతేకాదు ఆ ఫోటోను పోస్టు చేసిన దాని కింద ఆయన రాసిన కామెంట్లు కూడా అసక్తిని రేపుతున్నాయి. తన కుమారుడు గౌతమ్ ను హత్తుకుని ఆయన మురిసిపోయాడు. ఆ సమయంలో గౌతమ్ కుర్చీలో కూర్చొని ఉండగా మహేశ్ నిలబడి ఉండడం గమనార్హం. ఈ సందర్భంగా మహేశ్ కామెంట్ చేస్తూ... ‘అతడిని ఆలింగనం చేసుకోవడం ఇప్పుడు చాలా చాలా కష్టతరం. హత్తుకునేందుకు కారణం అవసరం లేదు.. సరైన సమయం కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు ’ అని మహేశ్ బాబు అన్నాడు. కాగా, ఇటీవల సినిమా షూటింగులకు హాజరు కాకపోయినప్పటికీ ఓ యాడ్‌ షూటింగ్‌ కోసం మహేశ్ మళ్లీ కెమెరా ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన చేతిలో సర్కారు వారి పాట సినిమా ఉంది. ప్రస్తుతం ఆయన భార్యాపిల్లలతో టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles