Gamanam Trailer Unveiled by Pawan Kalyan 'గమనం' తెలుగు ట్రైలర్ విడుదల చేసిన 'వకీల్ సాబ్'.!

Gamanam trailer looks promising pawan kalyan launches it on the sets of vakeel saab

Fahadh Faasil, Shiva Rajkumar, Sonu Sood and Jayam Ravi launched the Malayalam, Kannada, Hindi and Tamil trailers of the multi-lingual film. Vakeel saab, trailer, Sonu Sood, Shriya saran, Shiva Rajkumar, Shiva Kandukuri, Priyanka Jawalkar, nithya menen, Pawan Kalyan, Jayam Ravi, Gamanam, fahadh faasil, tollywood, movies, Entertainment

Pawan Kalyan took time out from his busy schedule of shooting for the Telugu remake of Pink, Venu Sriram’s Vakeel Saab, to launch the telugu trailer of Gamanam.

‘వకీల్ సాబ్’ సెట్ లో ‘గమనం’ ట్రైలర్ విడుదల చేసిన పవన్ కల్యాణ్.!

Posted: 11/11/2020 03:06 PM IST
Gamanam trailer looks promising pawan kalyan launches it on the sets of vakeel saab

ప్యాన్‌ ఇండియా మూవీ 'గమనం' తెలుగు ట్రైలర్ ను ఇవాళ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తాను నటిస్తున్న వకీల్ సాబ్ సెట్లో విడుదల చేశారు. తన షూటింగ్ బిజీ నుంచి కోంత సమయాన్ని కేటాయించిన పవన్.. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ ను లాంచ్ చేసిన తరువాత దానిని వీక్షించి.. చిత్రం చాలా ప్రామిసింగ్ గా వుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. హిందీ వర్షన్ ట్రైలర్ ను సోనూసూద్, తమిళ ట్రైలర్ ను జయం రవి, కన్నడలో శివరాజ్ కుమార్, మలయాళ వర్షన్ ట్రైలర్ ను ఫహద్ ఫసిల్ విడుదల చేశారు.

వేదం చిత్రం తరహాలో ఈ సినిమాలోనూ మూడు విభిన్న కథలను తీసుకుని చిత్రంగా మలిచారు. బధిరరాలిగా శ్రీయ చిన్నారికి తల్లిగా ఓ పాత్రలో ఒదిగిపోయి.. దుబాయ్ వెళ్లిన తన భర్త రాక కోసం వేచిచూస్తున్న పాత్రలో నటించింది. ఇక మరో కథలో ఇద్దరు అనాధ చిన్నారులు తమ జన్మదినాన్ని జరుపుకోవాలని భావిస్తుంటారు. మరో కథలో ప్రియాంక జవాల్కర్, శివ కందుకూరి ప్రేమజంటగా ఇమిడిపోయినా.. పేరొందిన క్రికెటర్ కావాలన్న ఆశలో శివ.. కలలు కంటే సరిపోదు అంటూ కార్యచరణ గుర్తుచేసే ప్రియురాలిగా ప్రియాంక జావాల్కర్ నటించారు.

వీరితో పాటు ఈ చిత్రంలో ప్రముఖ నటి నిత్యా మీనన్ కూడా కర్నాటక సంగీత విద్యాంసురాలిగా నటించింది. ఈ చిత్రానికి సాయిమాధ‌వ్ బుర్రా మాటలు రాశారు. రమేశ్ క‌రుటూరి, వెంకీ పుషా‌డ‌పు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ సినిమాలో శ్రియ, నిత్యామీనన్, ప్రియాంక జవాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. మూడు కథలను పరిచయం చేస్తూ గమనం ట్రైలర్ ను పవన్ కల్యాణ్ విడుదల చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles