'వకీల్ సాబ్' చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి మరోమారు ఎంట్రీ ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆ తర్వాత కూడా వరుస పెట్టి చిత్రాలను చేసేస్తున్నారు. వరుస చిత్రాలు, వరుస షూటింగులకు డేట్స్ ఇచ్చిబిజీగా వున్న పవన్.. వకీల్ సాబ్ పోస్టు పోడ్రక్షన్ పనుల్లో నిమగ్నం కాగానే తన తదుపరి చిత్రాన్ని విభిన్నమైన కథలతో చిత్రాలను రూపోందించే ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లపూడి దర్శకత్వంలో చేయనున్నారు. వాస్తవానికి ఈ చిత్రానికి సంబంధించిన కొంత షూటింగ్ లాక్ డౌన్ కి ముందు హైదరాబాదులో జరిగింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ వచ్చింది.
ఈ చిత్రం చారిత్రాత్మక కథతో రూపొందుతుండడం వల్ల చిత్రంలో వీఎఫ్ఎక్స్ పనులకు కూడా ఎక్కువ ప్రాధాన్యత వుందట. అందుకోసం ప్రముఖ హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ నిపుణుడు బెన్ లాక్ పనిచేయనున్నట్టు తెలుస్తోంది. ఇంతకుముందు 'ఆక్వామెన్', 'స్టార్ వార్స్ ఎపిసోడ్ 7', 'వార్ క్రాఫ్ట్' వంటి చిత్రాలకు బెన్ లాక్ వీఎఫ్ఎక్స్ సమకూర్చి అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నాడు. ఈయనను క్రిష్ తన చిత్రానికి నియమించుకున్నట్టు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్టుతో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా విలన్ పాత్రకు ప్రముఖ బాలీవుడ్ నటుడిని తీసుకుంటున్నారు. అలాగే, ఈ చిత్రానికి పవర్ ఫుల్ సంభాషణలు అవసరం కావడంతో బుర్రా సాయిమాధవ్ ను రచయితగా ఎంచుకున్నారు. మరోపక్క చిత్రంలో భారీ యాక్షన్ దృశ్యాలు కూడా ఉంటాయట. వాటిని రామ్-లక్ష్మణ్ నేతృత్వంలో చిత్రీకరిస్తారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని తెలుస్తోంది. వారి ఎంపిక త్వరలో పూర్తవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more
Aug 04 | నటన ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ఇటు హీరోగా అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినీరంగంలో దూసుకుపోతున్న నటుడు సత్యదేవ్. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినిమా రంగంలోకి అడగుపెట్టి ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు... Read more