Looop Lapeta First Bollywood Film To Get COVID-19 Insurance తాప్సి నటిస్తున్న 'లూప్‌ లపేటా' చిత్రానికి కోవిడ్ భీమా.!

Taapsee pannus looop lapeta is the first film to get covid 19 insurance

Taapsee Pannu, Covid insurance, Insurance for film, Covid 19, Coronavirus, lockdown, Taapsee Covid, Atul Kasbekar, Bollywood, movies, Entertainment

Headlined by Taapsee Pannu, Looop Lapeta is likely to become first Indian movie to get a Covid-19 special insurance. Producers Atul Kasbekar told Media that the producers are in touch with a legal firm to formulate a Covid-19 insurance for all their future projects. “We are in talks with the legal expert, Anand Desai of DSK Legal.

తాప్సి నటిస్తున్న ‘లూప్‌ లపేటా’ చిత్రానికి కోవిడ్ భీమా.!

Posted: 07/11/2020 12:25 AM IST
Taapsee pannus looop lapeta is the first film to get covid 19 insurance

యావత్ ప్రపంచంలోని అన్ని వ్యవస్థలు, రంగాలపై పలుపలు విధాల ప్రభావాన్ని చూపిన కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని ప్రభావిత రంగాల్లో చిత్రపరిశ్రమ కూడా ఒకటి. కొవిడ్‌ 19 కారణంగా చిత్రసీమ ఇప్పటికే చాలా నష్టాల్ని ఎదుర్కొంది. మార్చి 22 తరువాత విడుదల కావాల్సిన చిత్రాలు అనేకం సిద్దమైనా.. వాటిని రిలీజ్ చేసే అవకాశం లేదు. సినిమా ధీయేటర్లపై ఇంకా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో కరోనా ఎప్పుడెప్పుడు మటుమాయం అవుతుందా అంటూ అటు సినీరంగంతో పాటు ఇటు అభిమానులు కూడా కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ జరుగుతున్న పలు చిత్రాలు కరోనా విలయానికి తమ బడ్జెట్ ను కుదించాయి.

కోట్ల రూపాయల తృణప్రాయంగా పోసి మరీ చిత్రాలను నిర్మించే రంగాలు.. నిర్మాణం కావాల్సిన చిత్రాలన్ని ఇక తమకు సాధ్యమైనంత తక్కువ బడ్జెట్ లోనే నిర్మించుకునేందుకు మొగ్గుచూపుతున్నాయి, అందుకు కారణం కరోనా నుంచి కోలుకున్న తరువాత సినిమా రంగం ముందులా గాడిన పడేందుకు కూడా సమయం పడుతుందన్న వాదనలు తెరపైకి రావడమే. షూటింగులు చేయడం చాలా కష్టంగా మారింది. దానివల్ల సినిమా ఆలస్యం కావడంతో నిర్మాతకు నష్టాలు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే తమ సినిమాలకు బీమా చేయించాలని నిర్ణయించారు నిర్మాతలు అతుల్‌ కాస్‌ బెకర్‌, తనూజ్‌ గార్గ్‌.

ఈ ఇద్దరు నిర్మాతలు కలిసి తాప్సి ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న చిత్రం ‘లూప్‌ లపేటా’. ప్రమాద బీమా లాంటిదే ఈ కొవిడ్‌ బీమా కూడా అని చెబుతున్నారు అతుల్‌. ‘‘చిత్రబృందంలో ఎవరికైనా కొవిడ్‌ 19 పాజిటివ్‌ వస్తే మిగిలిన అందరూ హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిందే. దాంతో చిత్రీకరణ వాయిదా పడుతుంది. కొవిడ్‌ బీమా చేయించడం వలన చిత్రీకరణ చేయలేని రోజులకు ఏర్పడిన నష్టాన్ని పూడ్చుకోవచ్చు’’అని చెబుతున్నారు అతుల్‌. ప్రస్తుతానికి ‘లూప్‌ లపేటా’ బీమాకు సంబంధించిన డ్రాప్ట్‌ వర్క్‌ జరుగుతుంది. అన్ని అనుకున్నట్టు జరిగితే కొవిడ్‌ బీమా పొందిన తొలి చిత్రంగా ‘లూప్‌ లపేటా’ నిలుస్తుందంటున్నాయి చిత్రవర్గాలు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles