Ravi babu horror thriller 'Aaviri' completes censor సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న రవిబాబు.. ‘అవిరి’

Ravi babu horror thriller aaviri completes censor formalities

Ravi Babu’s Aaviri, Aaviri Teaser 3, Dil Raju, #AaviriTeaser3, Ravi Babu, Neha Chauhan, Spot The Spirit, tollywood, tollywood, movies, entertainment

Director Ravi Babu’s upcoming film Aaviri has raised curiosity among film buffs. The film which is sheduled to release on november 1st had completed censor formalities and acquired U/A certificate.

సెన్సార్ పనులు పూర్తి చేసుకున్న రవిబాబు.. ‘అవిరి’

Posted: 10/26/2019 01:01 PM IST
Ravi babu horror thriller aaviri completes censor formalities

నటుడిగా రవిబాబు విలక్షణమైన పాత్రలను పోషిస్తూ బిజీగా వుంటూనే.. మరోవైపు దర్శకుడిగా విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ చిత్రాలను రూపోందిస్తున్నాడు. మరీ ముఖ్యంగా హారర్ జోనర్ లో ఆయన రూపోందించే చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటున్నాయి. తాజాగా ఆయన రూపొందించిన చిత్రమే 'ఆవిరి'. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్టు పోస్టర్ కి .. టీజర్లకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

కంటికి కనిపించకుండా ఆత్మ చేసే పనులకి సంబంధించిన సన్నివేశాలతో ఈ చిత్రం రూపోందింది. తెలుగు తెరపై నటుడిగానే కాదు .. దర్శకుడిగా కూడా రవిబాబు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. సస్పెన్స్ థ్రిల్లర్లు .. హారర్ థ్రిల్లర్లు తెరకెక్కించడంలో ఆయన తనదైన ప్రత్యేకతను చూపుతూ వస్తున్నాడు. 'అవును' వంటి హారర్ థ్రిల్లర్ తో విజయాన్ని అందుకున్న ఆయన, అదే జోనర్లో 'ఆవిరి' టైటిల్ తో మరో సినిమాను రూపొందించాడు. నేహా చౌహాన్ ప్రధాన పాత్రధారిగా ఈ సినిమా నిర్మితమైంది.

ఆత్మల నేపథ్యంలో సాగే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ ఇప్పటికే అందరిలో ఆసక్తిని పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని, U/A సర్టిఫికేట్ ను సంపాదించుకుంది. నవంబర్ 1వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఓ పది .. పన్నెండేళ్ల అమ్మాయి ఆత్మ, మెట్ల పైభాగంలో నుంచుని చూస్తున్నట్టుగా వున్న కొత్త పోస్టర్ కూడా ఆకట్టుకుంటోంది.

దిల్ రాజు సమర్పిస్తున్న ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో భయపెడుతుందో వేచిచూడాలి. కాగా, ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఎన్.సుధాకర్ రెడ్డి, ఎడిటింగ్ : మార్తాండ్ కె వెంకటేష్, మ్యూజిక్ : వైధి, ఫైట్స్ : సతీష్, ఆర్ట్ : నారాయణ రెడ్డి, స్క్రీన్‌ప్లే : సత్యానంద్, కథ, నిర్మాత, దర్శకత్వం : రవిబాబు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Babu’s Aaviri  Aaviri Teaser 3  Dil Raju  Ravi Babu  Neha Chauhan  Spot The Spirit  tollywood  

Other Articles