Vijayashanthi first look from 'Sarileru Neekevvaru' ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి విజయశాంతి ఫస్ట్ లుక్

Vijayashanthi first look from mahesh babu sarileru neekevvaru

Sarileru Neekevvaru, vijayashanthi, Sarileru Neekevvaru cast, Sarileru Neekevvaru release date, mahesh babu, vijayashanthi movies, mahesh babu films, anil ravipudi, pongal release, diwali, Tollywood, movies, Entertainment

The first look of Vijayashanthi from her upcoming film Sarileru Neekevvaru is out. The look was unveiled by director Anil Ravipudi. Interestingly, the film marks her comeback as she returns to the movies after 13 years.

మహేశ్ ‘సరిలేరు నీకెవ్వరు’ నుంచి విజయశాంతి ఫస్ట్ లుక్ అదుర్స్

Posted: 10/26/2019 12:07 PM IST
Vijayashanthi first look from mahesh babu sarileru neekevvaru

సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాకు చెందిన ఒక్కొక్క అప్డేట్ ను చిత్ర యూనిట్ వరుసగా విడుదల చేస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు లుక్ ను విడుదల చేసిన యూనిట్ సభ్యులు... దీపావళి సందర్భంగా ఈరోజు విజయశాంతి లుక్ ను విడుదల చేశారు. లేడి అమింతాబ్ గా తెలుగు చిత్రపరిశ్రమలో ముద్రవేసుకున్న విజయశాంతి.. ఫస్ట్ లుక్.. అదిరింది.

స్టైలిష్ లుక్ తో ఈ పోస్టర్ లో విజయశాంతి ఆకట్టుకుంటున్నారు. కూర్చీలో కూర్చొని చిరునవ్వు నవ్వుతూ, ఏదో ఆలోచిస్తున్నట్టు ఆమె ఉన్నారు. దాదాపు 13 ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాల్లో నటిస్తుండటంతో... ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. అయితే, ఈ చిత్రంలో విజయశాంతి పోషిస్తున్న పాత్ర ఏంటనేది ఇంత వరకు చిత్ర యూనిట్ సీక్రెట్ గానే ఉంచింది. సంక్రాంతి సందర్భంగా 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం విడుదల కాబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayashanth  mahesh babu  sarileru neekevvaru  anil ravipudi  pongal release  diwali  tollywood  

Other Articles