Ileana Reacts on Ajay Devagan Recommendations | రెండు సినిమాలు చేస్తే అఫైరేనా? రికమండ్ చెయొద్దా?

Ileana on affairs rumour

Ileana, Ajay Devagan, Gossips, Ride Movie, Ileana Latest Interview, Ileana About Gossips, Ileana Ajay Devagan Relationship

Ileana Reacts on Reference of Ajay Devagan. The actress admitted that she bagged Raid on Ajay's recommendation, but maintained that no other film came her way because of him. "I have no qualms in saying that the only film he recommended me for was Raid. In fact, Arjun Kapoor [her co-star in Mubarakan] has also recommended a script to me, so it's not only about one actor," she said.

అఫైర్ వార్తలపై స్పందించిన ఇలియానా

Posted: 03/09/2018 12:03 PM IST
Ileana on affairs rumour

బాలీవుడ్ మీడియాలో గత కొద్ది రోజులుగా నటి ఇలియానా గురించి ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.  తనకు ఆఫర్లు ఇవ్వాలని అజయ్ దేవగణ్ సిఫారసు చేస్తున్నాడంటూ బాలీవుడ్ లో వార్తలు వెలువడడంపై గోవా సుందరి ఇలియానా స్పందించింది. ఇలాంటి వార్తలు వినడానికి ఫన్నీగా ఉంటాయని చెప్పింది.

ప్రచారంలో ఉన్నట్టు అజయ్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లు ఎలా పుట్టిస్తారో అర్థం కావడం లేదని ఇలియానా ఆవేదన వ్యక్తం చేసింది. తనను 'రైడ్' మూవీకి మాత్రం అజయ్ సిఫారసు చేశాడని, 'ముబారకన్' కో-స్టార్ అర్జున్ కపూర్ పరిశీలించమని తనవద్దకు ఒక స్క్రిప్టు పంపించాడని ఆమె వ్యాఖ్యానించింది. కో స్టార్లు ఆ మాత్రం సాయం చేసుకోవటం ఇండస్ట్రీలో సర్వసాధారణమే అని ఆమె వ్యాఖ్యానించింది.

ఒక్క స్టార్ తో వరుసగా రెండు సినిమాలు చేస్తే ఏదో ఉందని పుకారు పుట్టించేస్తారని రుసరుసలాడింది. అవన్నీ వాస్తవం కాదని స్పష్టం చేసింది. అయితే ఏదైనా సరే తనకు నచ్చితేనే చేస్తానని ఇలియానా తెలిపింది. కాగా, ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీ బోన్ తో లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles