Director Clear Airs on YSR Biopic | వైఎస్ బయోపిక్.. ఓ క్లారిటీ వచ్చేసింది

Clarity on ysr biopic

Director Mahi V Raghav, YS Rajasekhar Reddy, Biopic, YSR Biopic Rumours, Director Mahi YSR Biopic

Director Mahi V Raghav opens up about YSR biopic. Mahi Quashed Rumours that no actor selected till now.

వైఎస్ పాత్ర కోసం ఎవరినీ తీసుకోలేదు : దర్శకుడు మహి

Posted: 03/09/2018 11:20 AM IST
Clarity on ysr biopic

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత గాథను తెరపైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలైన విషయం తెలిసిందే. ఆనందో బ్రహ్మ ఫేమ్ మహి వి. రాఘవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించేందుకు ముందుకు వచ్చాడు.

అయితే ఈ చిత్రం కోసం నటీనటుల ఎంపిక జరిగిపోయిందంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఏకంగా మళయాళ స్టార్ మమ్ముటి పేరే వినిపించేసరికి మహి మీడియాకు క్లారిటీ ఇచ్చేశాడు.

ఈ చిత్రం కోసం ఎవరినీ సంప్రదించలేదని.. త్వరలో నటీనటుల ఎంపిక ప్రారంభిస్తామని చెప్పకొచ్చాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రమే సాగుతున్నాయని చెప్పాడు. విజయ్ చిల్లా, శశీదేవి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles