Koratala Hard Hitting Poitics on Bharat Ane Nenu | భరత్ అనే నేను.. ఏపీ రాజకీయాల పైనేనా?

Bharat ane nenu on present politics

Koratala Siva, Bharat Ane Nenu, Strong Message, AP Politics, Education System, Kaira Advani

Koratala Siva Strong Social Message with Bharat Ane Nenu. The Movie Especially deals with Current Education System, Central Funds, Rural Developments Etc. Mahesh Babu Kaira Advani starrer will release on April 20.

సమకాలీన రాజకీయాలతోనే భరత్ అనే నేను

Posted: 03/09/2018 11:02 AM IST
Bharat ane nenu on present politics

విజన్ ఆఫ్ భరత్ పేరిట వదిలిన టీజర్ ప్రభావం టాలీవుడ్ లో ఇప్పుడు మాములుగా చూపటం లేదు. మహేష్ బాబు లుక్కు.. దానికి తోడు ప్రామిస్ డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నాయి.

పొలిటికల్ డ్రామా ద్వారా కమర్షియల్ ఫార్మట్ లో స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ ఇచ్చేందుకు దర్శకుడు కొరటాల శివ సిద్ధమైపోతున్నాడు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, విద్యావ్యవస్థలో లోపాలు, గ్రామీణ ప్రాంత అభివృద్ధి.. తదితర విషయాలను ఇందులో చూపించబోతున్నారంట. అంతేకాదు రాష్ట్రానికి కేంద్రం నిధులు అన్న అంశాన్ని కొరటాల టచ్ చేయబోతున్నాడని తెలుస్తోంది.

నిజానికి కొరటాల తొలి నాళ్ల నుంచి ఏపీ అన్యాయంపై కేంద్రం వైఖరిని ప్రశ్నిస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో భరత్ అనే నేను ద్వారా సమకాలీన రాజకీయాల ప్రస్తావన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. దానికి తోడు ప్రామిస్ డైలాగ్ ను ఏపీ రాజకీయాలను అన్వయిస్తూ సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు కూడా.

మహేష్ బాబు, కైరా అద్వానీ హీరోహీరోయిన్లుగా.. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భరత్ అనే నేను తెరకెక్కబోతోంది. ఏప్రిల్ 20న చిత్రం విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles