Even Sunny Leone Has Strong Fan Following In India | ఇది ఇండియా.. సన్నీ లియోన్ కు కూడా ఫ్యాన్స్ ఉంటారు

Karni sena on padmaavta success

Shri Rajput Karni Sena, Padmaavat Movie, Historical Facts, Sunny Leone, Padmaavat, Karni Sena Vijendra Singh, Padmaavat Historical Blunders

Shri Rajput Karni Sena Reactions on Padmaavat Huge Success. "This Is India, Where Even Sunny Leone Has Strong Fan Following" Karni Sena Spokesperson Vijendra Singh said.

పద్మావత్ విజయంపై కర్ణిసేన స్పందన

Posted: 01/31/2018 12:18 PM IST
Karni sena on padmaavta success

రాజ్ పుత్ కర్ణి సేన హెచ్చరికలు, అభ్యంతరాలు పద్మావత్ చిత్ర విడుదలను అడ్డుకోలేకపోయాయి. చిత్రం విడుదలయ్యాక కూడా నిరసనలు కొనసాగినప్పటికీ.. అవేం ప్రభావం చూపలేకపోయాయి. పైగా మౌత్ టాక్ ద్వారా రోజు రోజుకీ ఈ సినిమా కలెక్షన్లు పెరిగిపోతున్నాయ్ కూడా. ఇద్దరు చరిత్రకారులను స్వయంగా ఆహ్వానించి శ్రీ శ్రీ రవి శంకర్ ఈ చిత్రాన్ని వారికి ప్రత్యేకంగా ప్రదర్శించారు. చరిత్రను వక్రీకరించారన్న కర్ణి సేన వాదనను ఆ ఇద్దరూ తోసిపుచ్చారు.

ఈ క్రమంలో చిత్ర విజయం, ఆ ఇద్దరు చరిత్రకారుల అభిప్రాయంపై కర్ణి సేన స్పందించింది. ‘‘ఇది భారత దేశం. సన్నీ లియోన్ లాంటి శృంగార తారకు కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అలాంటప్పుడు పద్మావత్ హిట్ కావటంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు’’ అని కర్ణి సేన ప్రతినిధి విజేంద్ర సింగ్ అంటున్నారు. ఇక చరిత్రకారుల నిర్ణయాన్ని తప్పుబట్టిన ఆయన.. వారసలు సినిమాను నిజంగానే చూశారా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక కర్ణిసేన ప్రతినిధులు లేవనెత్తుతున్న ప్రశ్నలు...

- గర్భవతి అయిన ఏ మహిళ కూడా జౌహార్(అగ్నిలో దూకి ఆత్మాహుతి)కి పాల్పడదు.
- చిత్తోడ్ గఢ్ పై అల్లావుద్దీన్ ఖిల్జీ 55 ఏళ్ల వయసులో దాడి చేశాడు. కానీ, సినిమాలో మాత్రం 25 ఏళ్లకే చేసినట్లు చూపించారు.
- అసలు చిత్తోర్ ఘఢ్ కోట ద్వారాన్ని ఖిల్జీ కూల్చేసినట్లు చరిత్రలో లేనేలేదు. కేవలం అతను ఆ ద్వారాన్ని పెకలించి వేసి తనతో ఢిల్లీకి తీసుకెళ్లాడు. తిరిగి 400 ఏళ్ల తర్వాత భరత్ పూర్ రాజు సూరజ్ మాల్ మళ్లీ ఆ ద్వారాన్ని పున: ప్రతిష్టించాడు. - - ఒక రాజు ఇంకో రాజ్యంలోకి ప్రవేశించి.. చంపుతానని బెదిరించటం అనేది ఏనాడూ జరగలేదు.

ఇంకా చిత్రంలోని పలు సన్నివేశాలపై కర్ణి సేన అనుమానాలు వ్యక్తం చేసింది. ఆ లెక్కన్న చరిత్రను వక్రీకరించినట్లే కదా అని కర్ణిసేన దర్శకుడు భన్సాలీపై ప్రశ్నలు గుపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Naga shaurya s lakshya worldwide release date is out

  రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న నాగశౌర్య ‘లక్ష్య’

  Sep 27 | మొదటి నుంచి విభిన్నమైన కథాంశాలతో వున్న కథలను ఎంచుకుని తనలోని నటుడ్ని పూర్తిస్థాయిలో ప్రదర్శింపజేస్తున్న యువనటుడు నాగశౌర్య, కరోనా కారణంగా ఆగిన చిత్రాలను అన్నింటినీ లైన్లోపెట్టిన నాగశౌర్య వరుడు కావలెను చిత్రంతో ప్రేక్షకుల ముందుకు... Read more

 • Konda polam trailer of adventure action and determination

  ఉత్కంఠ రేపుతున్న వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ ట్రైలర్

  Sep 27 | వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన తాజా చిత్రం కొండ‌పొలం. క్రిష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సినిమా మొద‌లైన‌ప్ప‌టి నుంచి ప్రేక్ష‌కులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైల‌ర్ రానే వ‌చ్చింది. మేకర్స్... Read more

 • Telugu producer rr venkat passes away aged 57 due to kidney related ailments

  టాలీవుడ్ లో విషాదం.. ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ కన్నుమూత

  Sep 27 | తెలుగు సినీపరిశ్రమలో వ‌రుస విషాదాలు అభిమానుల‌ని శోక‌సంద్రంలో ముంచెత్తుతున్నాయి. కరోనా వ‌లన కొంద‌రు, అనారోగ్యం వ‌ల‌న ఇంకొంద‌రు క‌న్నుమూసారు. ఇవాళ ఉదయం ప్ర‌ముఖ నిర్మాత ఆర్ ఆర్ వెంకట్ అనారోగ్య కారణాలతో కన్నుమూయడం టాలీవుడ్... Read more

 • Sharwanand s maha samudram trailer looks intense

  ఆకట్టుకుంటున్న శర్వానంద్ మ‌హాస‌ముద్రం ట్రైల‌ర్

  Sep 24 | ఆర్ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్రం మ‌హాస‌ముద్రం . శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ కాంబినేష‌న్ లో మ‌ల్టీ స్టార‌ర్ గా వ‌స్తున్న‌ ఈ చిత్రంలో అను ఇమ్మాన్యుయేల్, అదితీ రావు హైద‌రి... Read more

 • Ram charan unveils amusing stress reliever anubhavinchu raja teaser

  రామ్ చరణ్ విడుదల చేసిన ‘అనుభవించు రాజా’ ట్రైలర్

  Sep 24 | రాజ్‌ తరుణ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కషీప్‌ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాత.  ఇటీవలే ఈ సినిమా నుంచి రాజ్... Read more

Today on Telugu Wishesh