Won't Date or Marry Bollywood Actor | నటుడిని మాత్రం అస్సలు పెళ్లి చేసుకోను

Parineeti chopa on affairs

Parineeti Chopra, Bollywood Affairs, Parineeti Chopra Date Rumours, Parineeti Chopra Hardik Pandya, Parineeti Chopra Interview, Kesari Actress, Parineeti Chopra 2018 Movies, Parineeti Chopra About Love

Parineeti Chopra is currently single, Clarifies She does want Date with an actor or Marry him.

బాలీవుడ్ లో ప్రేమలు కష్టమే : పరిణితి

Posted: 01/31/2018 11:53 AM IST
Parineeti chopa on affairs

తన మైండ్ లో ఉన్నది ఉన్నట్లు బోల్డ్ గా చెప్పేయటం నటి పరిణితి చోప్రాకు ముందు నుంచి అలవాటు. ఆ మధ్య ఫిట్ నెస్ పేరిట కాస్త గ్యాప్ తీసుకున్న పరిణితి.. మేరీ ప్యారీ బిందు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ మధ్యే గోల్ మాల్ అగెయిన్ తో హిట్ అందుకుని ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ వ్యవహారం గురించి ఆమె స్పందించింది.

బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రేమ వ్యవహారాలు గుట్టుచప్పుడుగా ఉండవని పరి తెలిపింది. బాలీవుడ్ లో లవ్, డేటింగ్ చాలా కష్టమని అభిప్రాయపడింది. అందుకే తాను ఏ నటుడితోనూ డేటింగ్‌ చేయలేదని చెప్పింది. అంతే కాకుండా ఒక నటుడితో డేటింగ్ చేసి, అతనిని పెళ్లి చేసుకోవాలని కూడా లేదని తెలిపింది. చిత్రపరిశ్రమలో ప్రేమ వ్యవహారం కొనసాగించడం చాలా కష్టమని పేర్కొంది. కనీసం స్నేహంగా ఉందామన్నా కుదరదని పేర్కొంది. సినీ పరిశ్రమలోని వారితో ప్రేమ సవాలుతో కూడుకున్నదని పరిణీతి చెప్పింది. తాను సింగిల్ గానే ఉన్నానని.. అన్ని పనులు తనంతట తానుగానే చేసుకోగలనని చెప్పింది.

దర్శకుడు మనీష్ శర్మతో ప్రేమలో ఉండి, మూడేళ్ల క్రితం విడిపోయిన పరిణీతి క్రికెటర్ హార్డిక్ పాండ్యతో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి. ఆ తరువాత హార్డిక్ బిగ్ బాస్ ఫేం, బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రాంతో డేటింగ్ లో ఉన్నాడని ప్రచారం జరిగింది. తాను మాత్రం అవన్నీ ఉత్త వార్తలేనని స్పష్టం చేసింది. ఇక సినిమాల పరంగా చూసుకుంటే ప్రస్తుతం అర్జున్ కపూర్ తో ‘సందీప్‌ ఔర్‌ పింకీ ఫరార్‌’, అక్షయ్ కుమార్ తో ‘కేసరి’ ఈ బ్యూటీ నటిస్తొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles