First Clap for Chiru Son-in-law Debut | చిరు చిన్నల్లుడు.. సినిమా లాంఛ్ అయ్యింది

Mega hero kalyan movie launch

Chiranjeevi, Chiranjeevi Son in Law, Kalyaan Dhev Kanunganti, Debut, Malavika Nair, Rakesh Shashi, Sai Korrapati , Vaaraahi Productions

Chiranjeevi's Second daughter Srija's Husband Kalyaan Dhev Kanunganti Movie Launched. Rakesh Shashi of Jatha Kalise fame is going to direct Kalyan in a slice of life romantic drama.The untitled project has been formally launched today morning. Chiranjeevi himself gave the first clap and it is SS Rajamouli who directed the first shot. MM Keeravani also graced the launch. Sai Korrapati will pool resources for this film. Malavika Nair has been roped in for the leading lady’s role.

చిరు అల్లుడి మూవీ లాంఛ్ అయ్యింది

Posted: 01/31/2018 10:37 AM IST
Mega hero kalyan movie launch

చిరంజీవి చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ సినిమా లాంఛ్ అయిపోయింది. మెగా అభిమానుల నిరీక్షణకు తెర దింపేస్తూ ఈ ప్రాజెక్టును కొంతసేపటి క్రితం లాంచ్ చేశారు.

రాకేశ్ శశి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను వారాహి చలన చిత్ర బ్యానర్ పై సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి, తొలి ముహూర్తపు షాట్ కి క్లాప్ కొట్టారు. సంగీత దర్శకుడు కీరవాణి కెమెరా స్విచాన్ చేయగా.. దర్శకధీరుడు రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు. సెంథిల్ కుమార్ ఈ సినిమాకి కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండటం విశేషం.

ఇక ఈ చిత్రంలో ఎవడే సుబ్రహ్మణ్యం ఫేమ్ కల్యాణ్ జోడీగా మాళవిక నాయర్ ను తీసుకున్నారు. యోగేష్ సంగీతాన్ని అందిస్తోన్న ఈ సినిమాను త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles