Aishwarya Rai is my mom claims Vizag Man | ఐశ్వర్య కొడుకునంటూ వైజాగ్ యువకుడి హల్ చల్.. అలా పుట్టాడంట!

Vizag youth claims aishwarya his mother

Aishwarya Rai Bachchan, Sangeeth, Vishakpatnam, Aishwarya Rai Son, Vizag Youth Aishwarya Son

Bollywood beauty queen and former Miss World, Aishwarya Rai,Sangeeth says that he was born in 1988 in London through IVF and was raised for two years by Aiswarya’s parents. His father Aadivelu Reddy later brought him to Vishakpatnam. Sangeeth added that he had since been living at Vishakpatnam, Sangeet Kumar doesn’t possess any documents to prove that Aishwarya is his mother. He says that his relatives had destroyed the documents.

ఐశ్వర్య రాయ్ కొడుకునంటూ యువకుడి హల్ చల్

Posted: 01/03/2018 12:29 PM IST
Vizag youth claims aishwarya his mother

బాలీవుడ్ తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కు ఊహించని ట్విస్ట్ ఎదురైంది. ఆమె కొడుకునంటూ ఓ వ్యక్తి మీడియాకు ఎక్కటం ఆశ్చర్యకరంగా మారింది. ఫోటోలతో ఇప్పుడు అతను చేస్తున్న హల్ చల్ అంతా ఇంతా కాదు.

విశాఖకు చెందిన సంగీత్ కుమార్ ఐష్ తన తల్లి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ యువకుడి వయసు 29 సంవత్సరాలు కావడంతో అతని వీడియో ఇప్పుటు నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాను ఐవీఎప్ విధానం ద్వారా ఐశ్వర్యకు 1988లో జన్మించానని ఈ వీడియోలో సంగీత్ కుమార్ చెప్పుకున్నాడు. లండన్ లో తాను జన్మించానని, తన తండ్రి పేరు అడివేలు రెడ్డి అని చెప్పాడు.

చిన్నప్పుడు ఐశ్వర్య తల్లిదండ్రులు కృష్ణరాజ్ రాయ్, వ్రిందా రాయ్ లు తనను రెండేళ్లు పెంచారని, ఆపై అడివేలు రెడ్డి, తనను విశాఖకు తీసుకు వచ్చాడని అంటున్నాడు. తనకిప్పుడు తల్లితో ఉండాలని ఉందని, ఆమే తన తల్లి అని నిరూపించే ఆధారాలు ఏవీ తనవద్ద లేదని చెబుతున్నాడు. ఇక ఈ సంగీత్ కుమార్ వ్యాఖ్యలపై పలువురు మాత్రం మండిపడుతున్నారు. ఫేమస్ అయ్యేందుకు చిల్లర కథలు పడుతున్నాడంటూ తిట్టి పోస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles