NRI Director Speaks Cheap About US Audience | యూఎస్ ప్రేక్షకులపై ప్రవీణ్ సత్తారు దారుణ కామెంట్లు

Praveen sattaru comments on nri audiences

Director Praveen Sattaru, US Audiences, Controversy Comments, Garuda Vega Director, Praveen Sattaru Controversy, Praveen Sattaru NRI

Director Praveen Sattaru who is a US return talked cheap about US audiences. He called the US audiences as notorious who would rather prefer to order $5 pizza and then watch a downloaded film along with their friends. Adding to this, he said that US audiences don’t even read the reviews but only go by the rating of the movie and then decide to watch a movie.

యూఎస్ ఆడియన్స్ పై దర్శకుడి దారుణ వ్యాఖ్యలు

Posted: 01/03/2018 01:02 PM IST
Praveen sattaru comments on nri audiences

విభిన్న తరహా కథలతో చిత్రాలు తీసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాడు దర్శకుడు ప్రవీణ్ సత్తారు. యూఎస్ నుంచి వచ్చి ఎల్బీడబ్ల్యూతో కెరీర్ ప్రారంభించి చందమామ కథలు లాంటి నేషనల్ అవార్డు మూవీతోపాటు గుంటూరు టాకీస్.. గరుడ వేగలతో గుర్తింపు సంపాదించుకున్నాడు.

అయితే తాజాగా ఆయన యూఎస్ ఆడియన్స్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఐదు డాలర్లు పెట్టి పిజ్జా తినేవాళ్లు.. టికెట్ కొనుక్కొని సినిమా మాత్రం చూడరని.. డౌన్ లోడ్ చేసుకుని స్నేహితులతో చిత్రాలు చూస్తారంటూ మండిపడ్డాడు. అంతేకాదు వారు రివ్యూలు కూడా చదవరని.. కేవలం వాటికిచ్చే రేటింగ్ లను చూసి సినిమాలకు వెళ్తారంటూ పేర్కొన్నాడు.

కానీ, ప్రవీణ్ చెప్పిన లెక్క ప్రకారం చూస్కుంటే ప్రీమియర్ షోలతో అన్నేసి కలెక్షన్లు ఎందుకొస్తాయన్నది విశ్లేషకుల ప్రశ్న. ఒక ఎన్ ఆర్ ఐ అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న విశ్లేషకులు.. భవిష్యత్తులో అతని చిత్రాలపై ఈ ప్రభావం పడే అవకాశం లేకపోలేదని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles