Mahesh Babu Allu Arjun Drops from Summer Race | 2.ఓ.. నో మహేష్, బన్నీ?

Mahesh bunny movie drops in race

Robo 2.O Movie, Mahesh Babu, Bharat Anu Nenu, Allu Arjun, Na Peru Surya, 2.O Movie Release Date, Mahesh Allu Arjun Drop

Amid Robo 2.O Mahesh Allu Arjun Drops from Summer Race. All Movies first fixed same date as April 27th. Later Thinks to change Release Date.

రజనీకి నో పోటీ.. మహేష్, బన్నీ డ్రాప్?

Posted: 12/12/2017 05:41 PM IST
Mahesh bunny movie drops in race

దేశంలోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ చిత్రంగా రోబో 2.ఓ తెరకెక్కుతోంది. ఈ క్రమంలో రిలీజ్ డేట్ టాలీవుడ్ లో కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 27న విడుదల చేయాలని మేకర్లు స్ట్రాంగ్ గా డిసైడ్ అయినట్లు చెప్పకుంటున్నారు. ఇదే ఇప్పుడు కొన్నాళ్లుగా హాట్ టాపిక్ గా మారింది.

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు చేస్తోన్న 'భరత్ అనే నేను' సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో బన్నీ చేస్తోన్న 'నా పేరు సూర్య' సినిమాను కూడా అదే రోజున విడుదల చేయనున్నట్టుగా అంతకుముందే ఎనౌన్స్ చేశారు. దాంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ వుండనుందనే ఆసక్తి అభిమాల్లో మొదలైంది.

అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాలు కూడా విడుదల తేదీని మార్చుకోనున్నట్టు తెలుస్తోంది. అందుకు కారణం రజనీకాంత్ '2.0' అని సమాచారం. దాంతో అదే రోజున విడుదల కావలసిన మహేశ్ .. బన్నీ సినిమాలకి థియేటర్స్ దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 13న రావడానికే మహేశ్ రెడీ అవుతున్నాడని ఇది వరకే చెప్పుకున్నాం. ఇక బన్నీ కూడా డేట్ మార్చుకోబోతున్నాడని చెబుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles