Priyanka Chopra got Rare Reorganization Now | ప్రియాంక చోప్రాకు అస్సలు ఊహించని అవార్డు

Priyanka chopra receives mother teresa memorial award

Priyanka Chopra, Mother Teresa Memorial Award, Mother Teresa Memorial Award 2017, Mother Teresa Memorial Award Priyanka Chopra, Madhu Chopra

Priyanka Chopra receives the Mother Teresa Memorial Award for Social Justice. While Priyanka busy in shoot her Mother Madhu Chopra Receives Award and says great honour to bollywood to Hollywood turn actress.

ప్రియాంక చోప్రాకు మదర్ థెరిస్సా పురస్కారం

Posted: 12/12/2017 05:17 PM IST
Priyanka chopra receives mother teresa memorial award

న‌టి ప్రియాంక చోప్రా మ‌రో గౌర‌వాన్ని ద‌క్కించుకుంది. ఇప్ప‌టికే యునిసెఫ్ గుడ్‌విల్ అంబాసిడ‌ర్‌గా ఎంతో సామాజిక సేవ చేస్తున్న ప్రియాంక‌కు మ‌ద‌ర్ థెరిసా జ్ఞాప‌క అవార్డు కోసం ఎంపికైంది. స‌మాజానికి సేవ చేసిన వారికి(సోషల్ జస్టిస్) అవార్డును మ‌ద‌ర్ థెరిసా ట్ర‌స్ట్ అంద‌జేస్తుంది.

అయితే షూటింగుల్లో బిజీగా ఉన్న కార‌ణంగా ప్రియాంక ఈ అవార్డు అందుకోవ‌డానికి రాలేక‌పోయింది. దీంతో ఆమె త‌ర‌ఫున త‌ల్లి మ‌ధుచోప్రా ఈ అవార్డును స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మ‌ధు చోప్రా మాట్లాడుతూ - 'ప్రియాంక‌కి చిన్న‌ప్ప‌టి నుండి మ‌ధ‌ర్ థెరిస్సా అంటే ఇష్టం. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ ప్రాంతంలో ఉన్న ప్రేమ్‌ నివాస్‌ అనే వృద్ధాశ్రమానికి ప్రియాంక విరాళాలు కూడా ఇచ్చేది. స‌మాజానికి సేవ చేస్తున్న ప్రియాంక ఈ అవార్డుకు అర్హురాలే' అని మ‌ధు చోప్రా అన్నారు.

కాగా, ప్రస్తుతం క్వాంటికో సిరీస్ తోపాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తూ హాలీవుడ్ లో బిజీ అయిపోయింది. బాలీవుడ్ లో ఇప్పట్లో నటించే అవకాశాలు లేకపోగా.. నిర్మాతగా మాత్రం తన అదృష్టం పరీక్షించుకోబోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles