పద్మావతి చిత్ర వివాదం నానుతుండగానే.. ఆ చిత్ర యూనిట్ కు మద్ధతుగా సీనియర్ నటి షబానా అజ్మీ చేపట్టిన సంతకాల సేకరణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొత్తం ఇండస్ట్రీ దానిపై సంతకం చేస్తే.. నటి కంగనా రనౌత్ మాత్రం దాని పై సంతకం చేయలేదు. దీనిపై బాలీవుడ్ లో రకరకాల రూమర్లు వినిపించాయి.
గతంలో దీపికకు కంగనాకు మధ్య కొన్ని మనస్పర్థలు ఉన్నాయి. కంగనాకు అవార్డు వచ్చిన సమయంలో దీపిక చేసిన వ్యాఖ్యలు.. తర్వాత పీకూపై సెటైర్లు వేసిన కంగారు... ఇలా వీరి వ్యవహారం మీడియాలో కొన్నాళ్లపాటు సాగింది. అయితే ప్రధానికి పంపాల్సిన పిటిషన్ పై కంగనా సంతకం చేయకపోవటం ద్వారా దీపికపై ఈ రకంగా కసి తీర్చుకుందంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై చివరకు కంగనా స్పందించింది. మణికర్ణిక చిత్ర షూటింగ్ లో ఉండగా.. సెట్స్ కు వచ్చిన అనుష్క శర్మ షబనా పిటిషన్ గురించి నా వద్ద స్పందించింది. దీపికకు నా సపోర్టు ఎప్పుడూ ఉంటుంది. కానీ, షబానా అజ్మీ ఎప్పుడూ లెఫ్ట్-రైట్ వింగ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటారని.. అది నచ్చకే తాను సంతకం చేయలేదని తెలిపింది.
ఇదిలా ఉంటే ‘పద్మావతి’ సినిమాను నిలిపేయాలంటూ రాజ్ పుత్ కర్ణి సేన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, బిహార్ రాష్ట్రాల్లో ఈ సినిమాపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. సెన్సార్ బోర్డుదే తుది నిర్ణయమని ఇది వరకే కోర్టులు సైతం వ్యాఖ్యానించాయి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందోనని ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.
(And get your daily news straight to your inbox)
Aug 08 | టాలీవుడ్ యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘తీస్మార్ ఖాన్’. కళ్యాణ్ జీ గోగన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్ఎక్స్ 100 ఫేం పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటించింది. ఇవాళ మేకర్స్ తీస్మార్... Read more
Aug 04 | టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘సీతారామం’ ఒకటి. ఈ మధ్య కాలంలో ఈ సినిమాకు ఏర్పడిన బజ్ మరేసినిమాకు ఏర్పడలేదు. ఇప్పటికే ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవలే విడుదలైన... Read more
Aug 04 | నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ టైమ్ ట్రావెల్ చిత్రం ‘బింబిసార’. గత కొన్నాళ్లుగా చక్కని హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోకు లభించిన చక్కని టైమ్ ట్రావెల్ చిత్రం కలసిరానుందని సినీవిశ్లేషకులు చెబుతున్నారు.... Read more
Aug 04 | తమిళ హీరో కార్తి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుండి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ వరకు ఈయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తున్నాయి.... Read more
Aug 04 | దక్షిణాదిన నయనతార తర్వాత అంతటి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్న నటి సాయి పల్లవి. ముఖ్యంగా టాలీవుడ్లో ఈమె క్రేజ్ టైర్2 హీరోలకు సమానంగా ఉంది. గ్లామర్‌కు అతీతంగా సినిమాలను చేస్తూ అటు యూత్‌లో ఇటు ఫ్యామిలీ... Read more