Tammareddy Tone change on Clash with Rajasekhar | రాజశేఖర్ చాలా మంచోడే కానీ... వివాదం గురించి తమ్మారెడ్డి

Tammareddy on clash with rajasekhar

Tamareddy Bharadwaj, Hero Rajasekhar, Tamma Reddy Rajasekhar, Rajasekhar Vetagadu Movie, Rajasekhar about Tammareddy, Tamareddy Clashes in Tollywood

Tamareddy Bharadwaj open up clash with Actor Rajasekhar. Rajasekhar trouble him at Vetagadu Movie Time about remuneration.

రాజశేఖర్ గొడవపై స్పందించిన తమ్మారెడ్డి

Posted: 12/05/2017 02:49 PM IST
Tammareddy on clash with rajasekhar

వేటగాడు చిత్ర విషయంలో సీనియర్ హీరో రాజశేఖర్.. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజల మధ్య గొడవ గురించి తెలిసిందే. ఆ సినిమాతో తన కెరీరే సర్వనాశనమైందని.. ఆ సినిమా షూటింగ్ సమయంలో రాజశేఖర్ ఏమాత్రం సహకరించలేదని.. చాలామంది వద్దన్నా కూడా రాజశేఖర్ తో సినిమా చేసి తాను ఇబ్బంది పడ్డానని గతంలో తమ్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు.

అయితే ఆ విషయమై ఇటీవలే రాజశేఖర్ ఓ ఇంటర్వ్యూలో స్పందించాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గొట్టాలని తమ్మారెడ్డి భావించారని.. ఆ విషయంలో పట్టుదలతో వ్యవహరించి డబ్బులు రాబట్టుకున్నానన్న కోపంతోనే ఆయన తనపై అలాంటి ఆరోపణలు చేశారని.. కేవలం తాను షూటింగుకి లేటుగా రావడం వల్ల సినిమా ఫ్లాప్ అవుతుందా అని ప్రశ్నించారాయన.దీంతో రాజశేఖర్ కామెంట్లపై ఇప్పుడు తమ్మారెడ్డి స్పందించారు. వేటగాడు షూటింగ్ టైంలో రాజశేఖర్ ఇబ్బంది పెట్టడంతో షూటింగ్ డిలే అయిన మాట వాస్తవమే అని.. అలాగని అతను చెడ్డవాడని అనలేనని ఆయనన్నారు.

రాజశేఖర్ లో మంచి లక్షణాలు చాలా ఉన్నాయి. అతను వ్యక్తిగతంగా చాలా మంచి వాడని.. గొప్ప నటుడు. అలాంటి నటుడు తెలుగులో మరొకరు లేరు. ‘గరుడవేగ’ సినిమా చూసి రాజశేఖర్ కు ఫోన్ చేసి అభినందించా అని తమ్మారెడ్డి వెల్లడించారు. రాజశేఖర్ వైద్యుడిగా కూడా చాలా మందికి సాయం చేస్తాడని.. ఇండస్ట్రీలో ఎవరికైనా అనారోగ్యం ఉంటే.. వెళ్లి చూసి వస్తాడని.. డాక్టర్లకు కూడా బాగా చూసుకోమని చెబుతాడని.. ఈ మంచి లక్షణాల్ని తాను విస్మరించలేనని తమ్మారెడ్డి తెలిపారు. కానీ, ‘వేటగాడు’(బాజీఘర్ రీమేక్) సినిమా విషయంలో మాత్రం తాను చాలా దెబ్బ తిన్నానని.. ఈ సినిమాకు పారితోషకం విషయంలో రాజశేఖర్ ను తాను ఇబ్బంది పెట్టిన మాట కూడా వాస్తవమని.. రిలీజ్ ను ఆపించి.. వసూలు చేయించుకున్నాడని. అయినప్పటికీ అతనికి పూర్తి పేమెంట్ ఇవ్వలేదని, రాజశేఖర్ మూలంగానే సినిమా ఆలస్యంగా విడుదలై తాను తీవ్రంగా నష్టపోయానని తమ్మారెడ్డి చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles