Satires on Megastar Family Debts in Social Media | అమితాబ్ అప్పులు? సోషల్ మీడియాలో సెటైర్లు

Worth of jaya and amitabh bachchan s assets

Amithabh Bachchan, Big B Financial Troubles, Jaya Bachchan Assests Details, Jaya Amithabh Debt Details, Big B Loan from Son and Daughter In Law, Big B Loan Aishwarya Rai

Jaya Bachchan Reveals Bachchan Couple Debts. Big B Took 50 Crore Rupees Loan From Son Abhishek Bachchan, Was Also a Debtor of Aishwarya Rai. But, Social Media Satires on Big B Couple Debts.

బచ్చన్ ఫ్యామిలీ అప్పుల గోలపై జోకులు

Posted: 11/01/2017 11:25 AM IST
Worth of jaya and amitabh bachchan s assets

బాలీవుడ్ మెగాస్టార్ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఇప్పుడు జోకులు పేలుతున్నాయి. అందుకు కారణం మిసెస్ బిగ్ బీ చేసిన ఓ పని. తనకు, భర్త అమితాబ్ కు అప్పులు ఉన్నాయంటూ ఆమె సమర్పించిన నివేదికలో పేర్కొంది.

జయ బచ్చన్ పార్లమెంట్ సభ్యురాలు అన్న విషయం తెలిసిందే కదా. ఆస్తుల వివరాలను అఫిడవిట్ రూపంలో ఆమె సమర్పించారు. దాంట్లో అమితాబ్ బచ్చన్, తన కోడలు ఐశ్వర్యా రాయ్ నుంచి రూ. 21.4 కోట్ల అప్పు తీసుకున్నారని పేర్కొంది. అంతేనా, కొడుకు అభిషేక్ నుంచి అయితే ఏకంగా రూ. 50 కోట్లు అప్పు తీసుకున్నాడని తెలిపింది. అన్ని కలుపుకుని మొత్తం రూ. 104 కోట్ల అప్పులను అమితాబ్ చెల్లించాల్సి ఉందని చెప్పారు.

ఇక జయా బచ్చన్ కూడా అప్పులు భారీగానే చేసినట్లు తెలిపింది. ఆమె కూడా అభిషేక్ నుంచి రూ. 1.6 కోట్లు రుణంగా పొందిందంట. ఇక తన(వ్యక్తిగత) ఆస్తుల విలువ రూ. 48 కోట్లని ఆమె ప్రకటించారు. నిజానికి ఆమె జూలైలోనే ఈ నివేదిక సమర్పించినప్పటికీ అందులోని వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. కేబీసీ లాంటి షోలు, సినిమాలు, బ్రాండ్ అంబాసిడర్ ఇన్ని అవతారాల్లో కనిపిస్తున్న బిగ్ బీకి అప్పులు ఉన్నాయన్నదాంట్లో వాస్తవం మాటేమో గానీ, కొందరు మాత్రం బచ్చన్ కపుల్ ఆర్థిక కష్టాల గురించి సెటైర్లు మాత్రం వేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles