Kiran Bedi Reacted on Amala Paul Car Issue | అమలా, ఆ నటుడి కక్కుర్తి... గవర్నర్ సీరియస్.. నోటీసులు

Amala paul car car registration controversy

Actress Amala Paul, Amala Paul Notices, Amala Paul Car Registration, Amala Paul Kiran Bedi, Fahadh Faasil Amala Paul, Amala Paul Controversy, Fahadh Faasil Amala Paul Tax Evasion, Actress Puducherry Registration

Actress Amala Paul gets notice over luxury car. Along with Amala, Actor Fahadh Faasil evade taxes by registering luxury cars in Puducherry. Koduvally municipality councillor Karat Faisal has also been given a notice by the Motor Vehicle Department for tax evasion. Puducherry LT Governor Kiran Bedi says vehicles registration in Puducherry only for permanent citizens.

అమలాపాల్ కారు వివాదం ముదురుతోంది

Posted: 11/01/2017 09:04 AM IST
Amala paul car car registration controversy

నకిలీ రిజిస్ట్రేషన్ వ్యవహారం బయటపడటంతో నటి అమలాపాల్ చుట్టు ఉచ్చు బిగుస్తోంది. ఆమె ఖచ్ఛితంగా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈ వ్యవహారంపై స్వయంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ జోక్యం చేసుకున్నారు. పుదుచ్చేరిలో శాశ్వతంగా నివసించేవారికి మాత్రమే అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుందని ఆమె ప్రకటించారు. అటుపై కిరణ్ బేడీ విచారణకు ఆదేశించటం.. అమలకు నోటీసులు అందటం చకచకా జరిగిపోయాయి.

అమలాపాల్ గతేడాది పుదుచ్చేరిలో ‘బెన్స్ ఎస్ క్లాస్’ అనే కారును రూ.1.12 కోట్లకు కొనుగోలు చేశారు. ఈ కారును ఆమె సొంత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేయించాలంటే రూ.20 లక్షలు పన్ను చెల్లించాలి. దాన్ని ఎగ్గొట్టేందుకు ఓ యువతి పేరు, అడ్రస్ మీద నకిలీ రిజిస్ట్రేషన్ చేయించి అమలనే వాడుతోంది. అయితే ఆ కారు ప్రస్తుతం కేరళలో వినియోగంలో ఉండగా.. అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టగా అది అమల కారు అని తేలింది.

దీంతో కారు రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో స్పందించిన గవర్నర్ ఈ విషయంలో నిజానిజాలు తెలుసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. అయితే తప్పుడు చిరునామాతో రిజిస్ట్రేషన్ చేయించి పన్నులు ఎగ్గొడుతున్న బాపతులు చాలా మందే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. నటుడు భగత్ పాసిల్ కూడా ఇలాంటి పనే చేసి దొరికిపోవటంతో అమలతోపాటు అతనిపైనా చర్యలకు అధికారులు సిద్ధమౌతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amala Paul  Kiran Bedi  అమలా పౌల్  కిరణ్ బేడీ  

Other Articles